Jr NTR : దేవర వచ్చేది అప్పుడే! బన్నీని ఇబ్బంది పెట్టకుండా సైడ్ ఇచ్చిన తారక్..

Jr NTR : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ పార్ట్ 1 రిలీజ్ వాయిదా పడింది. తొలుత ఏప్రిల్ 5న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. ఏప్రిల్ 5న సినిమా వస్తే, జగజ్జీవన్ రామ్ జయంతి, 9న ఉగాది, 10న ఈద్ ఉల్ ఫితర్, 14న అంబేద్కర్ జయంతి.. ఇలా వరుసగా సెలవులు వచ్చేవి. పాజిటివ్ టాక్ వస్తే చాలు, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ ఉండేది. అయితే అనుకోని కారణాలతో ఈ మూవీ, ఏప్రిల్ నుంచి అక్టోబర్‌కి వాయిదా పడింది.

Jr NTR Devara : అనుకున్నట్టే వాయిదా పడిన ‘దేవర’.. కొంపముంచిన అనిరుధ్..

ఏప్రిల్ 5న రావాల్సిన సినిమా, అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. అంటే ఏకంగా 6 నెలల 4 రోజులు వాయిదా పడింది ‘దేవర’ పార్ట్ 1. ‘దేవర’ సైడ్ కావడంతో ఈ తేదీన విజయ్ దేవరకొండ వస్తున్నాడు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’, ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించింది చిత్ర యూనిట్.

దేవర రాకపోయినా దేవరకొండను పంపుతున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వైరల్ అయ్యాయి. అనుకున్నట్టుగానే దేవర వాయిదా పడి, దేవరకొండకు రూట్ క్లియర్ అయ్యింది. ఏప్రిల్ 5న వస్తున్న విజయ్ దేవరకొండకు, ఆ డేట్‌ నుంచి వాయిదాపడిన ‘దేవర’ దర్శకుడు కొరటాల శివకి ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ హిట్టు చాలా అవసరం.

Vijay Sethupathi : ఆ మాట మీద నిలబడిన విజయ్ సేతుపతి.. అందుకే రామ్ చరణ్ మూవీ నుంచి అవుట్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post