దేవరలో ఇదీ జరుగుతుంది..

Devara Update : ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ బెస్ట్ యాక్టర్ రేసులో నిలిచి, వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘దేవర’. రచయితగా కెరీర్ మొదలెట్టి, ప్రభాస్ ‘మిర్చి’తో దర్శకుడిగా మారిన కొరటాల శివ ఈ మూవీ డైరెక్టర్. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజీ’ సూపర్ హిట్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

‘స్కంద’ ఫైట్ సీన్‌లో బోయపాటి శ్రీను.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..

అయితే వరుసగా నాలుగు సక్సెస్‌లు అందుకున్న కొరటాల శివ, ‘ఆచార్య’ రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ని ఫేస్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడం కంటే, ఈ సినిమా ద్వారా వచ్చిన ట్రోలింగ్, కొరటాలను ఎక్కువ బాధపెట్టి ఉంటుంది. అందుకే ‘దేవర’ సినిమాను ఛాలెంజింగ్‌గా తీసుకుని, తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.

Devara Update

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘దేవర’ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. 2024, ఏప్రిల్ 5న ‘దేవర’ విడుదల కాబోతోంది. ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ మూవీపై మరింత హైప్ పెంచుతుంది.

బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..

ఇప్పటికే దేవర ఫస్ట్ పార్ట్ చివరదశ షూటింగ్ జరుపుకొంటుండగా.. ఇటీవల గోవాలో కీలక సన్నివేశాలను తెరకెక్కించింది దేవర టీం. వారం రోజులు గోవాలో షూటింగ్ జరగ్గా.. అందులో మొదటి రెండు రోజులు యంగ్ ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వీ కాంబినేషన్ లో సన్నివేశాలు తెరకెక్కించగా.. అనంతరం ఓల్డ్ ఎన్టీఆర్ తో మరిన్ని సీన్స్ షూట్ చేశారు.

అందులో ఓల్డ్ ఎన్టీఆర్ ఓ పెళ్లికి హాజరవగా.. ఆ పెళ్లిలో ఓ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేసాడు. గోవా సీన్స్ మూవీలో చాలా ముఖ్యమైనవని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న దేవర.. వచ్చే నెలలో కూడా మరో పదిరోజులు గోవా వెళ్లనుందని సమాచారం.

లంగా ఓణీలలో మెరుస్తున్న సినీ పూబోణి..

 

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post