Jr NTR Devara : వైజాగ్ అంటే.. భయపడుతున్న యంగ్ టైగర్..

Jr NTR Devara : జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు. ఆ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సషనల్, ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. RRR సినిమా దగ్గర నుంచి చిన్న పిల్లోడుకి కూడా దగ్గరయ్యాడు ఎన్టీఆర్. తాతకి తగ్గ మనవడిగా ఇండస్ట్రీని ఏలుతున్న యంగ్ టైగర్ ఇప్పుడు, గ్లోబల్ స్టార్ట్, మ్యాన్ అఫ్ మాస్సెస్ గా మారాడు.

లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటే, ‘వీరభోగ వసంతరాయలు’ పుడతాడని ఎన్టీఆర్‌కి చెప్పిన జ్యోతిష్యుడు..

అలాంటి ఎన్టీఆర్ కి తెలుగు రాష్టాల్లో స్వేచ్ఛ లేకుండా పోయింది. RRR సినిమా తరవాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. కీలకమైన సీన్లను గోవా వెళ్ళి షూట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మరి కొన్ని సీన్లు సముద్రం ఒడ్డున చేయాల్సి ఉండగా.. ఆ సీన్స్ వైజాగ్ బీచ్ లో చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తూ ఉండగా వైజాగ్ లో అభిమానులను ఆపలేమాని ఎన్టీఆర్ నిరాకరించినట్టు తెలుస్తుంది.

ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రిటీలు లోకల్ గా తిరగలేక వేకెషన్ పేరు చెప్పి వేరే దేశాలకు పారిపోయి సామాన్యంగా బతుకుతున్నారు.
స్టేజ్ మీద ఇంటి దగ్గర ఆఖరికి ఎయిర్పోర్ట్, హాస్పిటల్.. ప్లేస్ ఏదైనా అక్కడికి వచ్చి అభిమానులు హీరోలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. చివరకు.. లోకల్ లో షూటింగ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఫారిన్, ఇతర రాష్ట్రాల్లో షూటింగ్స్ తో ఓ వైపు మూవీ బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. దీంతో టికెట్స్ రేట్స్ పెరగడం జరుగుతుంది.

నాడు ఎన్టీఆర్, నేడు మెగాస్టార్, మరి రేపు..!?

ఏదిఏమైనా.. వైజాగ్ బీచ్ లో జరగాల్సిన దేవర షూట్ గోవాకు తరలింది. దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ కాగా, సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ ఈ మూవీలో జాన్వీ తండ్రిగా కనిపించనున్నాడు. కొరటాల ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది.

By Meena Rathna Kumari

I'm Meena, Meena Rathna Kumari, a passionate writer of love, romantic, and fiction stories. 📚✍️ Dreaming to be a film maker one day! 🎥 I'm a movie enthusiast and bookworm, always seeking inspiration. Check out my website at http://ramulamma.com/author/meena-rathna-kumari/ for more of my work. Don't forget to follow me on Facebook at https://www.facebook.com/MeenaRathnaKumari/ and Instagram at https://www.instagram.com/meena_rathna_kumari/ to stay updated! Join me on this incredible journey. 🎬 #mrkmeena #writerlife #filmlover

Related Post