Jr NTR Bollywood Movies : బాలీవుడ్‌లో పాగా వేస్తున్న ఎన్టీఆర్.. వార్ 2 తర్వాత హీరోగా మరో సినిమా..

Jrntr

Jr NTR Bollywood Movies : ఎన్టీఆర్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, టాప్ క్లాస్ డ్యాన్సర్ కూడా. ‘RRR’ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారి, ఆస్కార్ బెస్ట్ యాక్టర్ లిస్టులో షార్ట్ లిస్ట్ అయిన ఎన్టీఆర్… ఈ మూవీ తర్వాత పక్కాగా సినిమాలు సెలక్ట్ చేసుకుంటున్నాడు. ‘దేవర’ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు నందమూరి తారక రాముడు..

Jr NTR : దేవర వచ్చేది అప్పుడే! బన్నీని ఇబ్బంది పెట్టకుండా సైడ్ ఇచ్చిన తారక్..

హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘వార్ 2’ మూవీలో ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ మార్చిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ మాత్రం ‘దేవర’ షూటింగ్ అయ్యాక ఏప్రిల్‌లో ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ మూవీ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లోనే ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది.. ఈ మూవీ కోసం ఓ క్రేజీ స్టార్ డైరెక్టర్‌ని అనుకుంటున్నారట..

అంతటితో ఆగకుండా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో తెరకెక్కే సినిమాల్లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్ కూడా చేయబోతున్నాడు. అంటే బాలీవుడ్‌లో తన ఇమేజ్ పడిపోకుండా పక్కడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్.. ప్రభాస్‌కి ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ ఉంది… అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా వీరి దారిలోనే నడుస్తూ, రీజనల్ మూవీస్ కాకుండా పాన్ ఇండియా మూవీస్ సెలక్ట్ చేసుకుంటున్నారు.

Jr NTR Devara : వైజాగ్ అంటే.. భయపడుతున్న యంగ్ టైగర్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post