Japan Movie Review : ‘ఆవారా’, ‘యుగానికి ఒక్కడు’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరో కార్తీ నటించిన 25వ చిత్రం ‘జపాన్’. ట్రైలర్‌తో మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా, నేడు (నవంబర్ 10న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పొన్నియన్ సెల్వన్ మూవీస్‌తో మంచి సక్సెస్ అందుకున్న కార్తీ, తన కెరీర్లో మైలురాయి మూవీతో సక్సెస్ సాధించాడా?
నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?
రొటీన్ కథ :
జపాన్ ఓ చిన్న దొంగ. చోటా మోటా దొంగతనాలు చేసుకునే జపాన్, ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన రూ.200 కోట్ల నగలు ఎత్తుకళ్తాడు. ఆ రాజకీయ నాయకుడు, జపాన్ని ఎలా పట్టుకున్నాడు? జపాన్, ఆ పొలిటీషన్ నుంచి ఎలా తప్పించుకున్నాడనేదే కథ. తమిళనాడులో కొన్నేళ్ల క్రితం రాబరీలు చేసిన ఓ దొంగకు సంబంధించిన రియల్ కథే ఇదని చిత్ర యూనిట్ చెబుతోంది.
కార్తీ షో :
ట్రైలర్లో చూపించినట్టే ‘జపాన్’ మొత్తం కార్తీ వన్ మ్యాన్ షో నడిచింది. ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం, అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ పలికే విధానం అన్నింట్లోనూ వైవిధ్యం చూపించాడు కార్తీ. ఆయన ఫ్యాన్స్‌కి ఈ మూవీ కచ్ఛితంగా నచ్చుతుంది.
కేజీఎఫ్‌కి ముందు యష్ ఎవడు? అల్లు అరవింద్ కామెంట్..
చాలా రోజుల తర్వాత అనూ ఇమ్మాన్యూయల్కి మళ్లీ ఓ సినిమా దక్కింది. ‘జపాన్’ మూవీలో అను, అందంగా కనిపించినా నటించడానికి పెద్దగా అవకాశం దక్కలేదు. సునీల్, కె. ఎస్. రవికుమార్, విజయ్ మిల్టన్, జితన్ రమేశ్ పరిధి మేర నటించారు.
ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా కనిపించినా, కథ, కథనం పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. కేవలం ‘జపాన్’ అనే పాత్ర చుట్టూనే కథను రాసుకున్న డైరెక్టర్, దాన్ని ఇంట్రెస్టింగ్గా తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యాడు. మొత్తానికి కార్తీ ఫ్యాన్స్‌కి ఈ మూవీ నచ్చినా, మిగిలిన వారికి పెద్దగా నచ్చే అంశాలేవీ లేవు.
బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..