Jagapathi Babu : త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూర్ కారం’ మూవీ, నెగిటివ్ టాక్‌ని తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బాగానే నిలబడింది. డిజాస్టర్ టాక్‌తో యావరేజ్‌గా నిలిచింది. ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పుడు ఉన్న కథ వేరు, విడుదలైన కథ వేరు.. షూటింగ్ వాయిదాలు పడుతూ ముందుగా అనుకున్న పూజా హెగ్దే ప్లేస్‌లో హీరోయిన్‌గా శ్రీలీల వచ్చింది. శ్రీలీల క్యారెక్టర్‌లో మీనాక్షి చౌదరి వచ్చింది..
ఫైట్ మాస్టర్స్, కెమెరామెన్.. ఇలా చాలామంది మారిపోయారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభానికి ముందు ‘అరవింద సమేత వీర రాఘవ మూవీ కంటే పవర్ ఫుల్ పాత్రలో గుంటూర్ కారం సినిమాలో నటిస్తున్నాను. ఇది నాకు చాలా మంచి పేరు తెచ్చిపెడుతుంది… ’ అంటూ కామెంట్ చేశాడు జగపతి బాబు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక జగపతి బాబు పాత్ర విలన్‌కి తక్కువ, జోకర్‌కి ఎక్కువ ఉందని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్..
Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?
‘గుంటూర్ కారం మూవీ ప్రారంభంలో నా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్. అయితే ఆ తర్వాత కథ మారింది. క్యారెక్టర్ మారింది. అంతా కలిసి ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాను… మహేష్ బాబుతో కలిసి పనిచేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను.. శ్రీమంతుడు సమయంలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ నిజం చెప్పాలంటే గుంటూర్ కారం సినిమాని ఎంజాయ్ చేయలేకపోయాను… ’ అని అన్నాడు జగపతి బాబు..