Jagannath Rathayatra 2024 : జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్..

Jagannath rathayatra 2024
Jagannath rathayatra 2024

Jagannath Rathayatra 2024 : హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఒడిశా రాష్ట్రం పూరి నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. పూరి జగన్నాథ స్వామి ఆలయం అనేక అద్భుతాలు కలిగిఉంది. ఈ ఆలయాన్ని “శ్రీ క్షేత్రం”, “శంకు క్షేత్రం”, “పురుషోత్తమ క్షేత్రం” అని కూడా పిలుస్తారు.

సింహద్వారం:
సింహద్వారానికి ఇరువైపులా ఉన్న రెండు రాతి సింహాలు, వాటి ముందు ఏకశిలతో చెక్కిన అరుణస్తంభం కనిపిస్తాయి. ఈ స్తంభం మొదట కోణార్క్ లోని సూర్యదేవాలయంలో ఉండేది. కూర్దా దేశపు రాజు దీన్ని ఈ ఆలయానికి తరలించారు. ముఖద్వారానికి కుడి పక్కన జగన్నాథుని చిత్రపటం ఉంటుంది దీనిని “పతితపావన” అంటారు.

Arunachalam Temple : అరుణాచలం ఆలయ విశిష్టత..

ఆలయ నిర్మాణం:
పూరి జగన్నాథ్ ఆలయం 37,000 చదరపు మీటర్లలో నిర్మించబడింది. 214 అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తులో ఉంది. ప్రస్తుత ఆలయాన్ని అనంత వర్మ చోడ గంగాదేవ్ కళింగ శైలిలో పంచరాత్ర విధానంలో నిర్మించాడు.

దేవదేవుడికి రాజసమ్మానం:
జగన్నాథుని ఓ రాజుగా భావించి ఆలయం రాజకోటలా నిర్మించారు. ఇంద్రద్యుమ్న మహారాజు ఈ ఆలయాన్ని మొదట కట్టించారు. ఆయనకు విష్ణుమూర్తి కలలో కనిపించి, చాంకి నది తీరాన ఒక చెక్క విగ్రహాన్ని తయారుచేయమని ఆజ్ఞాపించారు. దైవశిల్పి విశ్వకర్మ, మారువేషంలో వచ్చి విగ్రహాలను తయారు చేశాడు.

ప్రాంతం:
ప్రాంగణంలో దాదాపు 120 గుళ్ళు ఉన్నాయి. ప్రధాన ఆలయం, జగన్మోహన, భోగానాట్య మండపాలు కూడా ఉన్నాయి. ప్రధాన ఆలయ శిఖరం 65 అడుగుల ఎత్తులో ఉంది.

రథయాత్ర:
జగన్నాథుని రథయాత్ర ఏడాదికి ఒకసారి, ఆషాఢ శుద్ధ విదియనాడు జరుగుతుంది. రథనిర్మాణానికి వైశాఖ బహుళ తదియనాడు పూరి రాజు ఆదేశాలు ఇస్తారు. రథనిర్మాణంలో 1072 మొక్కలను వాడతారు.

Ahobilam Temple History : అహోబిలం పుణ్యక్షేత్రం విశేషాలు..

మిస్టరీలు:
పూరి జగన్నాథ ఆలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
* ఆలయ శబ్దం: సింహద్వారం నుంచి లోపల ప్రవేశిస్తే, సముద్రం శబ్దం వినిపించదు.
* ప్రసాదం : ప్రసాదం వృధా చేయరు.
* గోపురం నీడ: గోపురం నీడ కనిపించదు.
* జెండా: గాలి వ్యతిరేక దిశలో ఊగుతుంది.
* చక్రం: ఎక్కడి నుండైనా సుదర్శన చక్రం మీ వైపుకు ఉన్నట్టే కనిపిస్తుంది.
* గాలి: పూరీలో గాలి సముద్రం నుంచి భూమి వైపుకు వీస్తుంది.
* పక్షులు: ఆలయంపై పక్షులు ఎగరవు.
* దేవుడి ప్రసాదం: 56 రకాల ప్రసాదాలు మట్టి కుండలో వండుతారు.

రథయాత్ర విశేషాలు:
రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథాలను తుడుస్తారు. ఆ తర్వాత వాటినీ తాళ్లతో లాగుతారు.
ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏంటంటే గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే, రథం తనంతట తానే ఆగిపోతుంది, దాన్ని ఎవ్వరూ ఆపరు ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీ లా ఉండిపోయింది.

Accommodation in Tirumala : తిరుమలలో రూమ్ దొరకడం లేదా! ఇలా చేస్తే నిమిషాల్లో రూమ్ గ్యారంటీ!!

ఈ రథయాత్రలో రెండు రకాలు ఉంటాయి. శ్రీ మందిరం గుండీజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు మొదటి రథం నది ఇవతల ఒడ్డున వరకు తీసుకెళ్తుంది అక్కడ మూడు చెక్క పడవుల్లో దేవతలను నాది దాటిస్తారు అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండీజా ఆలయానికి తీసుకువెళ్తారు.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post