నటీనటుల కెరీర్‌లో మైలురాయి చిత్రాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే పొలిటికల్ గ్యాప్ తర్వాత 150వ సినిమా చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన 150వ చిత్రంగా వచ్చిన ‘ఖైదీ నెం.150’ మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. అలాగే నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ కూడా ‘ఖైదీ నెం.150’తో పాటు ఒకేసారి విడుదలైంది. రెండూ సూపర్ హిట్లుగా నిలిచాయి.
రూ.100 కోట్లకు తగ్గేదిలే! స్టార్ హీరోల సినిమాలకు ఫుల్లు డిమాండ్..
అయితే కొందరి హీరోల కెరీర్‌లో ఈ మైలురాయి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. నాగార్జున నటించిన 25వ సినిమా ‘జైత్ర యాత్ర’. విజయ శాంతి హీరోయిన్‌గా నటించిన ‘జైత్రయాత్ర’కి స్వర బ్రహ్మా బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఈ మధ్యకాలంలో సూర్య నటించిన 25వ సినిమా ‘సింగం’, ధనుష్ నటించిన 25వ చిత్రం ‘రఘువరన్ బి.టెక్’, ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మంచి సక్సెస్ సాధించాయి. మహేష్ 25వ సినిమా ‘మహర్షి’ కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూళ్లు రాబట్టింది.
అందం ఉంది, అదృష్టం కలిసి రాకుంది! అను ఇమ్మాన్యూయల్‌కి తప్పని తిప్పలు..
అయితే నాని 25వ సినిమా ‘వీ’, నేరుగా ఓటీటీలో విడుదలైంది. సినిమాకి నెగటివ్ వచ్చింది. అలాగే భారీ అంచనాలతో తెరకెక్కిన పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ డబుల్ డిజాస్టర్‌గా మిగిలింది. కార్తీ నటించిన 25వ సినిమా ‘జపాన్’ కూడా ఫ్లాప్ సినిమాగా మిగిలింది. భారీ అంచనాలతో వచ్చిన ‘జపాన్’, కార్తీ ఫ్యాన్స్‌ని కూడా మెప్పించలేకపోయింది.