Indians Can Travel abroad without a visa : వీసా లేకుండా విదేశాల్లో విహరించి రావచ్చు! ఎక్కడెక్కడో తెలుసా..
సమ్మర్ హాలీడేస్ వచ్చాయంటే చాలు, వేడి తట్టుకోలేక ఎటైనా వెకేషన్‌కి వెళ్లాలని అనిపిస్తుంది. అయితే ఏ దేశానికి వెళ్లాలన్నా వీసాకి అప్లై చేయాలి, అప్రూవల్ రావాలి, పాస్ పోర్ట్ రావాలి… ఇంత ప్రాసెస్‌కి సమయం వెచ్చించలేక ఆ ప్లాన్స్ మానుకుంటూ ఉంటారు చాలామంది. అయితే కొన్ని దేశాలు, భారతీయులకు వీసా అవసరం లేకుండానే తమ దేశంలో విహరించేందుకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆ దేశాలేంటో చూద్దాం..
1. సీషెల్స్(Seychelles): హిందూ మహా సముద్రంలో ఉన్న ఈ ద్వీపానికి వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. దాదాపు 115 చిన్న చిన్న ద్వీపాలతో అరుదైన అటవీ జంతువులు, స్వచ్ఛమైన నీరు, చిన్నచిన్న అడవులు.. వేసవిలో మరిచిపోలేని అనుభూతులను పోగు చేసేందుకు ఈ దేశం ఓ చక్కని విహార ప్రాంతం..
2. శ్రీలంక(Sri Lanka:): భారత దేశానికి కింద ఉండే శ్రీలంక, ఓ అద్భుత ప్రకృతి సోయగాలతో నిండిన దేశం. రావణాసరుడు ఏలిన లంకలో హిందూ పురాత టెంపుల్స్ ఎన్నో ఉంటాయి. అలాగే వైల్డ్ లైఫ్ సఫారీ, బీచ్‌లు, టీ తోటలను చూడొచ్చు.
3. ఫిజి(Phys): ఫసిఫిక్ మహా సముద్రంలో 300 ద్వీపాలతో ఏర్పడిన చిన్న దేశమే ఫిజి. అతికొద్ది మంది జనాభా ఉండే ఈ దేశం, పర్యాటకులకు మాల్దీవులకు చక్కని ప్రాంతం.
4. నేపాల్(Nepal): హిమాలయ పర్వతాల అందాలను చూడాలంటే నేపాల్ వెళ్లాల్సిందే. ఎత్తైన పర్వతాలు, వేల చరిత్ర ఉన్న దేవాలయాలు, బౌద్ధ ఆలయాలు, ట్రెక్కింగ్ ఇలా ఎన్నో అనుభూతులను ఇస్తుంది నేపాల్ పర్యటన..
5. థాయిలాండ్(Thailand:): బ్యాంకాక్ చాలామందికి ఫెవరెట్ హాలీడే స్పాట్. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్‌తో పాటు ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. బీచ్‌లు, వెస్ట్రరన్ సంస్కృతి, ప్యాలెస్‌లు, రకరకాల ఫుడ్ ఐటెమ్స్ టెస్టు చేయాలనుకునేవారికి థాయిలాండ్ మంచి ఛాయిస్..
6. మారిషస్(Mauritius:): బీచ్‌లో పడుకుని, రిలాక్స్ అవ్వాలని అనుకుంటే మారిషస్ బెస్ట్ ప్లేస్. మారిషస్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని రకాల సముద్ర జీవుల వంటకాలు దొరుకుతాయి. సీ ఫుడ్ లవర్స్‌కి మారిషస్ బెస్ట్ హాలీ డే స్పాట్..
పైన చెప్పిన దేశాల్లో శ్రీలంక వంటి దేశాలు, సమ్మర్ వెకేషన్స్ ఆఫర్‌గా మే 31 వరకూ మాత్రమే వీసా లేకుండా భారతీయ పర్యాటకులను తమ దేశానికి ఆహ్వానిస్తున్నాయి. మారిషస్, మాల్దీవుల్స్, భూటాన్, నేపాల్, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిజి వంటి దేశాలు, వీసా లేకుండానే భారతీయ పర్యాటకులను తమ దేశానికి ఆహ్వానిస్తున్నాయి.