Indian Politics : మార్పు అనేది ఒక్కరోజులోనో ఒక్కసారికో రాదూ.. నిజమే కానీ ఎందుకు ఇంత ఓర్పు..!? ఓర్చుకున్న కొద్దీ దెబ్బలు తగులుతూనే ఉంటాయి అన్నట్టూ.. ఎవరు ఏదీ చేయరు, అందరూ ఒక్కటే అనుకున్న ప్రతిసారీ మోసం జరుగుతున్నప్పుడు.. ఎందుకు నీకు ఓటు..!?
క్రిమినల్ కేసులు ఉంటేనే ఎమ్మెల్యే సీటు! బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో సగం మంది..
నీకు ఓటు హక్కు ఇచ్చింది ఎందుకు? సరైన వాడు నిన్ను తండ్రిగా తీర్చిదిద్ది.. కష్టం – సుఖం, బాధ్యత, తెలిసేలా చేసేవాడు కావాలి అనే కదా.. నిన్ను, నీ డబ్బునూ వాడుకోవడానికి వచ్చిన వాడి దగ్గర, నువ్వు చిల్లర తీసుకుని సింహాసనం ఎక్కించే కర్మ ఎందుకు పట్టింది..!?
నీ కష్టంతో సంపాదించిన దాంట్లో టాక్స్ కట్టి, ఆ డబ్బు.. ప్రభుత్వం డబ్బుగా మారి నీకోసం, నీ సౌకర్యం కోసం ఖర్చు చెయ్యడానికి ఏరి కోరి దొంగల చేతికి తాళం ఇవ్వడమేంటీ..?
ఎవరో ఒకరు వచ్చి, నీ డబ్బుని దానం చేస్తునట్టు మైక్ ముందు ఊగిపోతూ ప్రసంగిస్తూ నీకు ఇవి ఉచితంగా ఇస్తాం.. అవి ఉచితంగా ఇస్తాం.. అనగానే ఆశపడి నీ ఓటు వేయడమేంటీ..!?
ఎన్టీఆర్ – రాజ్‌కుమార్ మధ్య సీక్రెట్ ఒప్పందం.. ఆ ఒక్క కారణంగానే..
నీకు బతకడానికి లేదా నీ మనసులో ఉన్న ఆలోచనని వ్యాపారంగా మార్చడానికి రాని చేతులు.. ఉచితంగా మీకు ఇస్తాం అన్నవాటితో సరితూగుతుందా..!?
ఏ ప్రైవేట్ బ్యాంకు, ప్రభుత్వం బ్యాంకు కూడా నిన్ను నమ్మి రూపాయి ఇవ్వదు. ఎందుకంటే నీ మీద నమ్మకం లేదు, మరి అలాంటప్పుడు డబ్బులు తీసుకొని నువ్వు వేసిన ఓటు నీకు పనికి వస్తుందా..!? మారేందుకు నీకు ఓటు.. కులానికో, బలగానికో, నోటుకో పడిపోయే నీ బుద్ది ఎందుకు..!?
నువ్వు అడగచ్చు అందరూ దొంగలే ఎవరికీ వేస్తే ఏంటీ.. అందుకే ఎవరికో ఒకరికి వేసాం అని.. అందరూ దొంగలే అనుకుంటే.. “నోటా” (NOTA) ఓటు అని నీకు ఒక ఆప్షన్ ఉంది అది వాడుకో.. ఇండియాలో ఇప్పటి వరకు రాయని చరిత్రకి శ్రీకారం చుట్టూ.. అంతే కానీ ఎవరికి పడితే వాళ్ళకు ఓటు వేసి నీకు నువ్వే వెన్నుపోటు పొడుచుకోకు..
కేంద్ర రాజకీయాల్లోకి కేసీఆర్? వారసుడి ప్లేస్ కోసం కేటీఆర్, హరీశ్ రావు మధ్య పోటీ..