Indian Drainage System : భారీ వర్షాలు పడితే ఎందుకు మనం భయపడతాం.. మన డ్రైనేజి సిస్టమ్ ఎందుకు ఇలా ఉంది. మన డ్రైనేజీ system కు ఇంతరదేశాల డ్రైనేజీ system కు తేడా ఏంటో తెలుసుకుందాం..
ఒక గంట గట్టిగా వర్షం పడితే చాలు Hyderabad రోడ్లన్నీ జలమయమై ఫుల్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎలాగోలా బతుకుజీవుడా అంటూ ఇంటికి చేరుతాం.. అదే ఒక రోజంతా ఆగకుండా వర్షం కురిస్తే ఇక అంతే సంగతి, అనేక ప్రాంతాలు నీట మునిగి, హైదరాబాద్ మహానగరం చెరువులను తలపిస్తుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అనేక మంది పునరావాస కేంద్రాలకు చేరుకొని అధికారాలు పంచే పాల ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్ల కోసం వేచి చూసే దీనస్థితికి చేరుకుంటారు.
అసలెందుకు ఇంత చిన్న వానకే మనం వణికిపోతున్నాం.. ఇంతకుమించి అనేక రెట్లు అధిక వర్షాలు కురిసే దేశాలు మనలాగా ఎప్పుడూ ఇబ్బంది పడవేం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..!? మన వాటర్ డ్రైనేజీ సిస్టంకు, ఇతర దేశాల డ్రైనేజీకి ఉన్న ముఖ్యమైన తేడాలేంటో చూద్దాం..
Vande Bharat: వందే భారత్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం..
1. చెరువుల ఆక్రమణ
2. Coverage (కవరేజ్)
3. Capacity (సామర్థ్యం)
4. Maintenance (నిర్వహణ)
5. Corruption (అవినీతి)
* చెరువుల ఆక్రమణ :
హైదరాబాద్ లో ఒకప్పుడు దాదాపు 3000 నుంచి 7000 చెరువులు ఉండేవి. అందుకే హైదరాబాద్ ను City of Lakes అని పిలిచేవారు. ఒకప్పుడు వేలాదిగా ఉన్న చెరువులు, ఇప్పుడు 400 నుంచి 500 కు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని అతిపెద్ద సరస్సు అయిన హుస్సేన్ సాగర్ ప్రాంతం, కేవలం 30 సంవత్సరాలలో 40% కంటే ఎక్కువ తగ్గిపోయింది.
ఈ లెక్కలు చాలనుకుంటా..
హైదరాబాద్ లో ఎన్ని చెరువులు అక్రమణకు గురై వాటి స్థానంలో ఎన్ని అపార్టుమెంట్లు వెలిసాయో చెప్పడానికి.. మరి అలాంటప్పుడు భారీ వర్షాలు కురిస్తే నీరు ఎక్కడకు వెళ్తుంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడం తప్ప ఇంకో మార్గం లేదిక్కడ.. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి..
వాటి స్థానంలోకి మనం వెళ్ళామే తప్పా.. మన ఇంటికి అవి రాలేదు.
Govt Schemes : పేరులో ఏముంది బ్రదర్..
* కవరేజ్ (Coverage) :
అనేక అభివృద్ధి చెందిన దేశాలలో Cities లోని అన్ని ఇళ్లకు Underground Sewerage system Connect అయి ఉంటుంది. కానీ మన దగ్గర అలాంటి సదుపాయం లేదు. వర్షాలు పడ్డప్పుడు ఆ నీరు కాలనీలను ముంచెత్తుతాయి.
* సామర్థ్యం (Capacity) :
మన దేశ ఆర్థిక పరిస్థితి కారణంగా అనేక పట్టణాల్లో అవసరమైన దానికంటే తక్కువ సమర్థ్యంతో డ్రైనేజీ systemను నిర్మించారు. దీనికి తోడు గ్రామాల్లో ఉపాధి లేక అనేక మంది పట్టణాలకు వలసొస్తారు. దీంతో పట్టణాల్లో జనాభా పెరగడంతో పాటు వనరుల అవసరం కూడా పెరుగుతుంది.
ఇతర దేశాలు ఎప్పటికప్పుడు తమ జనాభా పెరుగుదలకు అనుగుణంగా వనరులు Upgrade చేసుకుంటాయి. కానీ మన దగ్గర అలా జరగలేదు. ఇప్పటికీ హైద్రాబాద్ లో అనేక ప్రాంతాల్లో నిజాం కాలం నాటి డ్రైనేజి వ్యవస్థే ఉంది. నాడు నిజాం రాజులు డ్రైనేజీ నిర్మించినప్పటి హైద్రాబాద్ జనాభా వేరు, నేడు హైదరాబాద్ జనాభా వేరు. అందుకే దానికి పర్యవసానాలు అనుభవిస్తున్నాం.
దొంగ చేతికి తాళాలివ్వడం అంటే ఇదే..
* నిర్వాహణ (Maintenance) :
Maintenance అనేది డ్రైనేజీ system కు మరో ముఖ్యమైన అంశం. మన డ్రైనేజీలు ఎప్పుడూ చెత్తాచెదారాలతో నిండిపోయి ఉంటాయి. మనం తిని పడేసిన Lays Packet Cover కూడా మన డ్రైనేజీ system ను నిర్ణయిస్తుందంటే మీరు నమ్ముతారా.. నేనొక్కడినే ఒక cover రోడ్ పై పడేస్తే ఏమవుతుంది అనుకుంటే.. మనలాగే ఎంతమంది అనుకోవడం వలన మన డ్రైనేజీలు వాటర్ బాటిల్స్ వంటి చెత్త చెదారాలతో నిండి ఉన్నాయి.
మనం తిన్న ఒక చిన్న కవర్ ను Dust Bin లో వేయాలంటే మనకు బోలెడంత బద్ధకం కానీ ఇతర దేశాల్లో చిన్న పిల్లలు కూడా ఏ చిన్న కాగితం ముక్కనూ రోడ్లపై వేయరు. డ్రైనేజీలో ఉన్న నీరునే సాఫీగా వెళ్లేలా చేయడానికి మనం అనేక ఇబ్బందులు పడుతున్నాం కానీ అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఏకంగా కొన్ని వారాల పాటు మంచు కురిసి రోడ్లన్నీ మంచుతో పేరుకుపోతాయి, ఆ మంచు డ్రైనేజీ వాటర్ కు కూడా అడ్డుపడుతుంది.
అక్కడి అధికారులు ఎప్పటికప్పుడు రోడ్లపై మంచును తొలగిస్తుంటారు.. డ్రైనేజీ వాటర్ కు అడ్డుపడిన మంచును స్టీమర్ల ద్వారా కరిగించి వెంటనే డ్రైనేజీని క్లీన్ చేస్తారు. మన దగ్గర వరదలొచ్చి ముంచెత్తాక కానీ అధికారులు కళ్ళు తెరవరు.
* అవినీతి (Corruption) :
మన దేశానికి పట్టిన అతిపెద్ద దరిద్రం అవినీతి. 90% మన దేశంలో అధికారులకు లంచం ఇవ్వనిదే ఏ పని జరగదు. అంతే కాదు.. ఏ పని జరగాలన్నా లంచమే ఇవ్వాలి. దీని ఫలితమే చెరువులు ఉండాల్సిన చోట బిల్డింగులు లేసాయి. కాసులకు కక్కుర్తిపడ్డ అనేక మంది ఇంజనీర్లు ఎన్నో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టూ.. డబ్బు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనడానికి హైద్రాబాద్ లో నిర్మించిన అనేక అపార్టుమెంట్లే నిదర్శనం.
దీన్ని లోతుగా విశ్లేషిస్తే.. రాజకీయ నాయకులు, ఓట్లు, నోట్లు అన్ని ముడిపడి ఉంటాయి. దీని గురించి మళ్ళీ మనం ఎప్పుడైనా చర్చించుకుందాం..