Impressive Heroine in Traditional Look : దక్షిణ భారతదేశంలోని స్త్రీలు ధరించే సాంప్రదాయక వస్త్రాల్లో ఓ రకం లంగా ఓణి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో యుక్తవయస్సులోని అవివాహితులైన స్త్రీలు ధరిస్తారు. దీనిని తమిళులు ధావనిగా పిలుస్తారు. అవివాహిత యువతులు ధరించే దక్షిణ భారత సాంప్రదాయిక దుస్తులు లంగా ఓణి లేదా పావడ. వివాహాల సీజన్ వచ్చిందంటే చాలు అమ్మాయిల హంగామా మామూలుగా ఉండదు. లంగా ఓణీలు అంటూ సంప్రదాయ దుస్తుల వేటలో పడిపోతారు. ప్రస్తుతం లంగా ఓణీల ట్రెండ్ నడుస్తున్నది. పట్టు లంగాలకు మగ్గం వర్క్ జతచేసి మరింత ముచ్చటగా రూపొందిస్తున్నారు.
దేవరలో జాన్వీ ‘తంగం’ పాత్ర పోషిస్తుంది జాన్వీ కపూర్. ఆ రోల్‌లో ఆమె లంగా ఓణీలో పల్లెటూరి అమ్మాయిలా అలరించనుంది. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లంగా ఓణీ లుక్ లో జాన్వీ కపూర్ మెరిసింది. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ కూతురుగా నటించి మెప్పించింది యంగ్ బ్యూటీ శ్రీలీల. విజ్జి పాపగా లంగా ఓణీలో కనిపించిన విభిన్న లుక్స్ లో ఇదొకటి. సాయి ధరమ్‌తేజ్ హీరోగా రూపొందిన ‘విరూపాక్ష’లో నందిని కూడా లంగా ఓణీలో లుక్‌తోనే ‘మ్యాజిక్’ చేసింది.
బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న ‘పుష్ప 2 : ది రైజ్’లో రష్మిక మందన్న కూడా లంగా ఓణీలో కనిపించింది. సాయి పల్లవి ఎం పిక చేసుకునే పాత్రలన్నీ దాదాపు లంగా ఓణీతో ముడిపడే ఉం టాయి. ‘లవ్‌స్టోరి’లో (మౌనిక), విరాటపర్వంలో వెన్నెల పాత్రలకు సాయి పల్లవి లంగా ఓణీతో దక్షిణాది ఆమ్మాయిలా అలరించింది. రంగస్థలంలో సమంత కొండ పొలంలో రకుల్‌ప్రీత్ సింగ్ గద్దలకొండ గణేష్‌లో పూజాహెగ్డే, ఇస్మా ర్ట్ శంకర్ లోని బోనాలు పాటలో నభానటేశ్ ఈ హాఫ్ శారీలో ఆకట్టుకున్నారు.
ఫేక్ వీడియోలు చేయడం కూడా నేరమే! రష్మిక వీడియోపై మొదలైన రచ్చ..