Ice Cream Finger : ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేయగా అందులో మనిషి వేలు రావడంతో షాక్ అయ్యాడు. ఆయన ఈ ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తూ అతని నోటిలో ఏదో “పెద్ద గింజ” అని ఫీల్ అయ్యాడు కానీ అది గోరుతో ఉన్న వేలు అని తేలింది.
ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. మలాడ్‌లోని ఓర్లెం నివాసి అయిన డాక్టర్ బ్రెండన్ ఫెర్రావ్ ఆన్‌లైన్ యాప్ ద్వారా మూడు ఐస్‌క్రీమ్ కోన్‌లను ఆర్డర్ చేశాడు. వాటిలో ఒకటి యమ్మో బ్రాండ్‌కు చెందిన బటర్‌స్కోచ్ కోన్. తర్వాత జరిగిన ఘోరాన్ని వివరిస్తూ.. “నేను ఐస్ క్రీం మధ్యలోకి రాగానే, అకస్మాత్తుగా నాకు అక్కడ పెద్ద ముక్క అనిపించింది. మొదట్లో, అది పెద్ద గింజ అని నేను అనుకున్నాను. అదృష్టవశాత్తూ, నేను తినలేదు. అయినప్పటికీ, దానిని దగ్గరగా చూసిన తర్వాత, నేను దానిపై ఒక గోరును చూశాను.”
Pushpa 2 postponed : పుష్పరాజ్ భయపడ్డాడా..!?
ఇంకా ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.. “నిన్నటి నుండి, నా నాలుకపై తిమ్మిరి ఉంది. ఐస్ క్రీం లో మనిషి యొక్క శరీర భాగాన్ని ఎలా ఉంచుతారు అని నేను గొడవ పడ్డాను. అది ఒక నెల క్రితం ప్యాక్ చేసింది అని ఆయన పేర్కొన్నాడు.
దీనిపై డాక్టర్ మలాడ్‌లోని పోలీసులను ఆశ్రయించగా యమ్మో ఐస్ క్రీమ్ కంపెనీపై కేసు నమోదు చేసి ఐస్ క్రీమ్ శాంపిల్ ను ఫోరెన్సిక్ విచారణకు పంపారు.