Holi Festival 2024 : సంతోషాల్ని తెచ్చే రంగుల పండగ హోలీ. చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ వర్గాల వారు జరుపుకునే పండగ. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం హోలీని మార్చి 25 అంటే సోమవారం జరుపుకుంటున్నారు. హోలీకి ఒకరోజు ముందు హోళికా దహన్ గా జరుపుకుంటారు. దీనిని చోటి హోలీ అని కూడా పిలుస్తారు. ఇది ఆదివారం మార్చి 24 చేసుకుంటారు.
హోలీ చరిత్ర :
హిరణ్యకసిపుడు ప్రజలు తనని ఆరాధించాలని కోరుకున్నాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణును ఆరాధించడానికి ఇష్టపడతాడు. దానితో మనస్థాపానికి గురి అయిన హిరణ్యకసకుడు. తన కొడుకును శిక్షించాలని నిర్ణయించుకుంటాడు. అగ్నికి అతీతమైన తన సోదరి హోలీకను ప్రహ్లాదున్ని మంటల్లో కూర్చోమని చెప్తాడు. హోళికను ఆ మంటలు చంపేస్తాయి. కానీ ప్రహ్లాదున్ని క్షేమంగా వదిలేస్తుంది. అప్పుడు విష్ణువు నరసింహ రూపాన్ని ధరించి హిరణ్యకసిపుడుని సంహరిస్తాడు.
Heatwave in India : మండే ఎండలు, వడ గాల్పులు.. ఈసారి వేసవి దంచికొడుతుందట..
పోలిక దహన్ అనేది ఈ హోళిక సంఘటనకు నిదర్శనంగా పెట్టిన పేరు అత్యంత శక్తివంతమైన అలాగే ఆనందకరమైన హిందూ పండగల్లో ఒకటి హోలి. ఈ హోలీని పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు త్రిపురలలో రంగుల పండగ లేదా డోల్ జాత్ర లేదా బసంత ఉత్సవం అని కూడా పిలుస్తారు.
ఇది దేశంలో మరియు భారతీయులంతా జరుపుకునే పండుగ ప్రపంచానికి గొప్ప ఉత్సాహంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది. హిందూ క్యాలెండర్లో పాల్గొనమాసం సాయంత్రం పౌర్ణమి లేదా పౌర్ణమి ఘడియల్లో, ఈ హోలీ జరుపుకుంటారు. అందరూ కలిసికట్టుగా వారి బాధల్ని మరిచిపోయి జీవితంలో రంగుల క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటారు.
హోలీ రోజు ఉదయం ప్రత్యేకమైన పూజలు చేస్తారు. సంవత్సరంలో సౌభాగ్యవంతమైన రోజుగా ప్రజలు భావిస్తారు, హోలీ మిలన్ అని కూడా అంటారు. ఈ హోలీ పండగ రోజే ఎక్కువగా గంజాయిని ఉపయోగించి తండే లేదా బంగ్ అనే పానీ అని తయారు చేస్తారు. ముఖ్యంగా హోలీ పండుగ రోజు చిన్నాపెద్దలందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ హోలీ పండుగ జరుపుకునే ఆచారం తగ్గిందనే చెప్పాలి. కేవలం రంగులు మాత్రమే చల్లుకుంటున్నారు.
పాటలు, నృత్యాలు చేస్తూ జరుపుకుంటున్నా రసాయనిక రంగులు కొంతమందికి పడక చర్మ సంబంధించిన వ్యాధులు రావచ్చు. కొన్నిసార్లు కళ్ళల్లో పడితే చూపు పోయే ప్రమాదం ఉంది. స్కిన్ దురదలు రావచ్చు.. పరిమితిలోనే సహజ సిద్ధంగా తయారు చేసే రంగులు వాడడం వల్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
Curd Benefits : పెరుగుతో ఆరోగ్యం పెరుగు..
ఈ పండుగ కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో 16 రోజులపాటు జరుపుకుంటారు. రాధాకృష్ణుల ప్రేమని కొనియాడతారు. అలాగే గోపిక కృష్ణుని రాసలీలలు, ఈరోజే కీర్తిస్తారు. కృష్ణుడు తన ఒంటి రంగు నలుపబ్ గురించి రాధా ఒంటి రంగు గురించి తన తల్లికి ఫిర్యాదు చేసినప్పుడు కృష్ణుడు తల్లి రాధా మొహానికి రంగు పూయాలని అనుకుందంట. అందుకే ఈరోజుకి అందరూ రంగులు పులుముకుంటారని ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. వసంత రుతువు అంటే ప్రేమ వికసించే మాసంలోనే ఈ పండుగ వస్తుంది.
మరో కథ తెలుగు వారికి తెలిసిందే..
శివపార్వతుల వివాహం గురించి…
శివుడు తపస్సు చేస్తూ ఉంటే మన్మథుడు (కామదేవుడు) శివునిపై పూలబాణం వేసినప్పుడు తపస్సు భంగం కలిగినప్పుడు శివునికి కోపం వచ్చి తన మూడవ కన్ను తెరిచి ఆ మంటల్లో కాముని నాశనం చేస్తాడు. పతివియోగం భరించలేని రతీ దేవి కోరిక మేరకు శివుడు కామదేవుని బ్రతికిస్తాడు కానీ భౌతిక రూపం కన్నా ప్రేమ తత్వానికి తెలిపే మానసిక ప్రతిరూపంగానే బ్రతికిస్తాడు. ఈ సంఘటనను గుర్తు చేస్తూ హోలీ పండుగ జరుపుకుంటారు.