Hero Venkatesh : టాలీవుడ్‌లో హేటర్స్ లేని హీరోల్లో ‘విక్టరీ’ వెంకటేశ్ ఒకరు. వరుస బాక్సాఫీస్ విజయాలతో ‘విక్టరీ’ని ఇంటి పేరుగా మార్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్, త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారు. సినిమాల్లో కూడా పొలిటికల్ నాయకుడి రోల్ చేయడానికి పెద్దగా ఇష్టపడని వెంకటేశ్, రాజకీయాల్లోకి రావడం ఏంటి? ఆయనకి ఈ రాజకీయాలు సెట్ అవుతాయా? అయితే వెంకీ, నేరుగా పాలిటిక్స్‌లోకి రావడం లేదు. కేవలం ఖమ్మం జిల్లాలో తన వియ్యంకుడు, కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తరుపున ప్రచారం చేయబోతున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత, వినాయక్ రెడ్డిని వివాహం చేసుకుంది. 2019లో జైపూర్‌లో వీరి విహహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ పెళ్లి తర్వాత స్పెయిన్‌లో సెటిల్ అయ్యారు. వినాయక్ రెడ్డి తండ్రి రామసహాయం రఘురాం రెడ్డి, ఖమ్మం ఎంపీ నియోజికవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో దిగుతున్నారు. దీంతో వియ్యంకుడి కోసం స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు విక్టరీ వెంకటేశ్.
Venky Atluri : మనవాళ్లతో రాడ్ సినిమాలు! వాళ్లతో క్లాసిక్ సినిమాలు..
రామసహాయం రఘురాం రెడ్డి చిన్న కొడుకు అర్జున్, మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్న రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా విక్టరీ వెంకటేశ్ చిన్న కూతురు హయవాహిని, ఈ ఏడాది మార్చి 15న నిశాంత్‌ని వివాహం చేసుకుంది. నిశాంత్ డాక్టర్ కాగా అతని తండ్రి డాక్టర్ పటూరి వెంకట రమణారావు, ఆంధ్రా హాస్పటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్.