Heatwave in India : ఫిబ్రవరి పూర్తి కాకముందే ఎండలు మండిపోయాయి. మార్చి నెల సగం పూర్తి కాకపోతే, మధ్యాహ్నం బయట అడుగుపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి. రాబోయే రోజుల్లో వాతావరణం మరింత వేడెక్కబోతుందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. కేరళ, తమిళనాడు, రాయలసీమ, పుదుచ్చేరి ఏరియాల్లో ఎండలు విపరీతంగా పెరగబోతున్నాయి..
AaduJeevitham : ఎడారిలో మేకల మధ్య.. ‘ఆడుజీవితం’ సినిమా ఓ నిజ జీవిత సంఘటన..
అలాగే ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌లోనూ ఈసారి ఎండలు రికార్డు స్థాయికి తాకుతాయి. బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే జార్ఖండ్, విదర్భ, ఛత్తీస్‌ఘడ్, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మార్చి నాలుగో వారంలో తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది..
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో మార్చి నెల నుంచే వడగాల్పులు వీయడం మొదలుకానుంది. తెలంగాణ, కోస్తా ఆంధ్రా ప్రాంతాల్లో మార్చి నెలాఖరులో తేలిక పాటి వర్షాలు కురిసి, వాతావరణం కాస్త చల్లబడుతుంది. అయితే ఆ తర్వాత ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది.. ఈసారి వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని హెచ్చరించింది వాతావరణ శాఖ..
Modi vs Advani : అప్పుడలా.. ఇప్పుడిలా.. మోదీ కపట ప్రేమ..