Health Benefits of Usirikaya : ఉసిరికాయ పురాణకాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషధ ఫలం. సంస్కృతంలో ఆమలక ఫలం అంటారు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా ఉంది. బ్రిటిష్ వారు దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీగా పిలిచేవారు. చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది ‘విటమిన్ సి’ కి బ్యాంక్ లాంటిది. యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. సీజన్ కానప్పుడు ఉసిరి దొరకదు. దీన్నే పెద్ద ఉసిరి, రాగి ఉసిరి అన్ని కూడా అంటారు.
ఉపయోగాలు..
* ఉసిరిలో ఉన్న విటమిన్ సి మరియు యాంటీ కొలెస్ట్రాల్ గుణాలు అధికబరువు, అధిక పొట్ట తగ్గడానికి సహాయపడతాయి.
* ఒక రెండు మూడు పెద్ద ఉసిరికాయలు తీసుకొని గింజలు తీసివేసి మిక్సీలో వేసి, దానిలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు, చిటికెడు మిరియాల పొడి కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి.
* ఆ రెడీ అయిన జ్యూస్ లో ఒక స్పూన్ తేనే కలిపి ఉదయం పరగడుపున ప్రతిరోజు తీసుకొంటే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది.
* ఈ చలికాలంలో ఉసిరి ఒంటిలో ఉష్ణాన్ని పుట్టిస్తుంది.
* ఉసిరిని రెగ్యులర్ గా తీసుకోవటం వలన రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి.
* మహిళల్లో మోనోఫాజ్ సమస్యలను తగ్గిస్తుంది.
* మధుమేహం సమస్య ఉన్నవారు ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.
* శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సాధారణ జబ్బులు రాకుండా కాపాడుతుంది.
Say No DP : సంస్కారం లేని టెక్నాలజీ..