Health Benefits of Smile : నవ్వే తెలిసిన పశువుని కూడా మనిషే అనవచ్చు..
నవ్వే మరిచిన మనిషే ఉంటే పశువే అనవచ్చు.. అన్నాడో సినీ రచయిత.
నవ్వు నాలుగు విధాల చేటు అన్నది కాలం చెల్లిన సామెత, “నవ్వే” దివ్యౌషదం అన్నది జగమెరిగిన సత్యం.
మనం గమనిస్తే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూవుండే వారినే ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ , కొలీగ్స్ గానీ ఇష్టపడతారు.
నలుగురు మన చుట్టూ చేరి జోక్స్ వేసుకుంటూ ఆనందంగా నవ్వడం వలన మన ఆయుష్షు కూడా పెరుగుతుంది. మనం మనస్ఫూర్తిగా నవ్వడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి అవేంటంటే..
* మనం హాయిగా నవ్వినప్పుడు బాడీలోని ప్రతి భాగం స్పందిస్తుంది. దాంతో మన శ్వాసలో వేగం పెరుగి.. పొట్ట, మెడ, ముఖం, భుజాలకు మంచి వ్యాయామంలా పని చేస్తుంది.
* నవ్వడం వలన బ్లడ్ లో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. అలాగే రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. మన గుండె పనితీరు కూడా మెరుగవుతుంది.
Benefits of Crying : ఏడవడం ఓ వరం..
* నవ్వు శరీరంలోనే సహజమైన నొప్పి నివారుణులను, సంతోషంగా ఉన్నామన్న భావనను కలిగించే ఒక ఉత్ప్రేరకాన్ని రిలీస్ చేస్తుంది. దాన్నే “ఎండార్ఫిన్” అంటారు.
మనకు గతంలో ఎవరైనా చెప్పిన జోక్ గుర్తుకు వచ్చిన కూడా ఇప్పుడు నవ్వుతుంటాం. ఎందుకంటే ఆ జోక్ గుర్తుకు రాగానే మన మెదడు ఎండార్ఫిన్ లను రిలీజ్ చేస్తుంది. ఈ ఎండార్ఫిన్ అనే హార్మోన్ వలన మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.
* ఆనందంగా ఉన్న వారికి సహజంగా కలిగే అనుభూతిని, కొంతమంది కృత్రిమంగా పొందేందుకు ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వాటిని ఆశ్రయిస్తారని రీసెర్చ్ లో తేలింది.
అంటే ఆల్కహాల్, డ్రగ్స్ చేసేపని పనేంటంటే మన శరీరంలో ఎండార్ఫిన్స్ ని కృత్రిమంగా విడుదల చేయడమే.
అంతేకాదు నవ్వుకి మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది.
వస్తువుల తాలూకు యాడ్స్ కి హాస్యాన్ని జోడిస్తే అమ్మకాలు రెట్టింపుగా పెరుగుతాయని అంటారు. హాస్యాన్ని జోడించడం వలన ప్రచార కర్త మాటల్ని వినియోగదారులు సులభంగా నమ్ముతారని పరిశోధనల్లో తేలింది.
ప్రస్తుతం చాలా సిటీస్ లో లాఫింగ్ థెరపీలకు మంచి గిరాకీ ఉంది.
ప్రెసెంట్ టీవీలో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ అంత హిట్ అవడానికి కారణం.. జనాల్ని ఆగకుండా నవ్వించడమే.
ఆ మధ్య రిలీజ్ అయిన జాతిరత్నాలు మూవీ సక్సెస్ సీక్రెట్.. అందులోని పాత్రలు మనల్ని కడుపుబ్బా నవ్వించడమే..
Love Failure : ఉన్నది ఒకటే జిందగీ..
* అమ్మాయిలు కూడా ఎక్కువగా నవ్వుతూ, నవ్వించే అబ్బాయిలనే ఇష్టపడతారట..
అంతెందుకు మనం ఏదైనా ఆఫీస్ కి కొత్తగా జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మేనేజర్ ఫేస్ ని సీరియస్ గా పెట్టి ప్రశ్నలు అడుగుతుంటే ఇలాంటోడి దగ్గర పడ్డామేంట్రా అన్న నిరుత్సాహంతో పాటు, అక్కడ పని చేయడానికి కూడా మనం పెద్దగా ఆసక్తి చూపించం.
అదే మేనేజర్ మనం రూమ్ లోకి ఎంటరవగానే నవ్వుతూ పలకరించాడనుకో.. హ్యాపీగా, కంఫర్ట్ గా ఫీల్ అవ్వడమే కాకుండా ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధమవుతాం.
నవ్వు దివ్యౌషధం గా ఎలా పని చేస్తుందో తెలియజేసే రియల్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం..
* నార్మన్ అనే వ్యక్తికి వెన్నుపూసకు సంబంధించిన “యాంకిలో స్పాండిలిటిస్” అనే వ్యాధి సోకింది. ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా, ఎంత మంది డాక్టర్స్ ని కలిసిన విపరీతమైన నొప్పులతో మరణించడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. అప్పుడు నార్మన్ బతికినన్నాళ్ళయినా ఆనందంగా బతకాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతను ఒక హోటల్ గదిని అద్దెకు తీసుకుని, అనేక హాస్యభరిత చిత్రాలను చూస్తూ 6 నెలలు గడిపాడు.
తరువాత అతన్ని పరిశీలించిన డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. వైద్యానికి సైతం లొంగదు అనుకున్న అతని వ్యాధి పూర్తిగా నయమైంది. ఆ తరువాత నార్మన్ తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ “అనాటమి ఆఫ్ ఇల్నేస్” (Anotomy of Illness) అనే పుస్తకాన్ని కూడా రచించాడు.
Love Guru : వరల్డ్ ఫేమస్ లవ్ గిఫ్ట్
చిన్న పిల్లలు రోజుకి సగటున 400 సార్లు నవ్వితే..
యుక్త వయసులో సగటున 15 సార్లు నవ్వుతారట. కాస్త పెద్దయ్యాక జీవితంలో బాధ్యతలు పెరగడంతో నవ్వడం తగ్గించేస్తారు.
మనం ఏడవడానికి వంద కారణాలు ఉండొచ్చు కానీ నవ్వడానికి వెయ్యి కారణాలు ఉంటాయి.
జంధ్యాల గారు అన్నట్టు నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం.
అందుకే కాస్త నవ్వండి డ్యూడ్స్ మహా అయితే ఏమవుతుంది తిరిగి నవ్వుతారంతే . .