HBD Vijay Deverakonda : ఎక్కడ తప్పు చేస్తున్నాడు..?

HBD Vijay Deverakonda : విజయ్ దేవరకొండ… నాలుగేళ్ల క్రితం ఈ పేరు టాలీవుడ్‌లో ఓ సంచలనం. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్ మార్మోగిపోయింది. ఆ సినిమా తర్వాత ‘మహానటి’, ‘గీతా గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘ట్యాక్సీవాలా’ సినిమా రిలీజ్‌కి ముందే పైరసీ జరిగి, సగానికి పైగా సినిమా వెబ్‌సైట్లలో ప్రత్యక్షమైంది. అయినా థియేటర్లలో మంచి సక్సెస్ అందుకోగలిగింది. అయితే ఇక్కడి నుంచే విజయ్ దేవరకొండ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది..

విజయ్ దేవరకొండ ఎంతో నమ్మి చేసిన ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’ సినిమాలు ఒకదానికి మించి ఒకటి డిజాస్టర్లుగా నిలిచాయి. నిజానికి ‘డియర్ కామ్రేడ్’ మూవీ, టీవీల్లో వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. రిలీజ్ తర్వాత వచ్చిన ట్రోలింగ్ కారణంగానే ‘డియర్ కామ్రేడ్’ మూవీ, కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది.

Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్ తగ్గిందా..!?

ఇక పూరీ జగన్నాథ్‌ని నమ్మి, తీసిన ‘లైగర్’, డైరెక్టర్ కెరీర్‌లో అత్యంత చెత్త సినిమాగా చెప్పొచ్చు. ఎందుకంటే పూరీ జగన్నాథ్ కెరీర్‌లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘హార్ట్ ఎటాక్’, ‘ఇజం’ వంటి ఎన్నో ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే అవి అంతో కొంతో మెప్పించాయి. ఆఖరికి వరుణ్ తేజ్‌తో చేసిన ‘లోఫర్’ వంటి సినిమాకి కూడా కొందరు ఫ్యాన్స్ ఉన్నారు. బాలయ్యతో తీసిన ‘పైసా వసూల్’, ఆయన ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్‌లా అనిపిస్తుంది. అలాంటిది పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండకి ‘లైగర్’ రూపంలో పెద్ద రాడ్ ఇచ్చాడు..

హీరో క్యారెక్టరైజేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, కామెడీ కానీ, ఫైట్స్ కానీ ఎక్కడా పూరీ స్టైల్ కనిపించదు. విజయ్ దేవరకొండ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలని పని కట్టుకుని తీసినట్టుగా ఉంటుంది ‘లైగర్’.. ‘లైగర్’ ఇచ్చిన దెబ్బకు కాస్త గ్యాప్ తీసుకుని ‘ఖుషీ’ చేశాడు విజయ్ దేవరకొండ. తెలంగాణ, సీడెడ్ ఏరియాల్లో మంచి లాభాలు తెచ్చిపెట్టిన ‘ఖుషీ’ మూవీని ఆంధ్రాలో అస్సలు పట్టించుకోలేదు. అక్కడ రూ.10 కోట్ల నష్టాలు మిగిలాయి. కారణం అక్కడి జనాలకు రౌడీ బాయ్ కనెక్ట్ కాకపోవడమే..

అల్లు అర్జున్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇలా అందరి హీరోలు కూడా విజయ్ దేవరకొండను ద్వేషించడం మొదలెట్టారు. కారణం వీడు ఎక్కడ మా హీరోకి పోటీ అవుతాడో అనే భయం. విజయ్ దేవరకొండకి వచ్చిన క్రేజ్ అలాంటిది మరి. వాస్తవానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల ఫాలోవర్లు దాటిన మొట్టమొదటి తెలుగు హీరో విజయ్ దేవరకొండనే.. అయితే విజయ్, బన్నీని దాటేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోయాయి. అప్పటికప్పుడు వందల, వేల అకౌంట్లు క్రియేట్ చేసి అల్లు అర్జున్‌ని ఫాలో కొట్టి.. మళ్లీ బన్నీని టాప్‌లోకి తీసుకొచ్చారు..

Vijay Deverakonda : విజయ్ తో సుక్కు సినిమా లేనట్టేనా.. మెగా ఫ్యామిలీ వల్లే..

‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీ, విజయ్ దేవరకొండ గత 5 ఐదేళ్లలో చేసిన సినిమాల కంటే చాలా బెటర్‌గా ఉంటుంది. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. కారణం సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగే. ప్రతీ స్టార్ హీరో సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉంటాయి. అయితే వచ్చిన ట్రోలింగ్ మాత్రం అంతకుమించి.. ఈ ట్రోలింగ్‌కి కారణం ఎవరు? ఎవరు చేయిస్తున్నారు? విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కారణంగానే ఇంతమంది హేటర్స్ వచ్చారా? లేక విజయ్ దేవరకొండ ఎదుగుదలను చూడలేనివాళ్లు, తెర వెనక నుంచి దీన్ని నడిపిస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం చాలామంది అభిమానులకు తెలుసు..

అయితే విజయ్ దేవరకొండ కెరీర్ పాడవడానికి పూర్తిగా వీళ్లే కారణం కాదు. సరైన సబ్జెక్ట్ ఎంచుకోవడంలో విజయ్ దేవరకొండ చేసిన తప్పులు కూడా కారణమే. ‘లైగర్’ మూవీ అవుట్‌ఫుట్ చూసి కూడా రూ.200 కోట్లు కొల్లగొట్టే సినిమా అవుతుందని విజయ్ ఎలా అనగలిగాడు? ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా విజయ్‌ని విజయాలకు దూరం చేసినట్టుంది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post