HBD Allu Arjun : అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్, కె.రాఘవేంద్ర రావు 100వ సినిమా ‘గంగోత్రి’ తో తెరంగ్రేటం చేశాడు. ఈ మూవీ రాఘవేంద్ర రావు టేకింగ్ కారణంగా 100 రోజులు ఆడేసినా, ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్స్‌పైన తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. అమ్మాయి గెటప్‌లో అల్లు అర్జున్ కనిపించిన లుక్స్ చూసి, ‘వీడు హీరోనా?’, అసలు మెగా ఫ్యామిలీలో పుట్టకపోయి ఉంటే అసలు హీరో అయ్యే ఫేసేనా? ఇది అని తీవ్రంగా ట్రోలింగ్ చేశారు జనాలు.
సరిగ్గా 21 ఏళ్ల తర్వాత అదే జనాలు, అల్లు అర్జున్ యాక్టింగ్‌కి ఫిదా అయిపోయి.. ‘వీడు రా హీరో అంటే’ అంటున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి డజను మంది హీరోలు వచ్చినా, ‘నెక్ట్స్ మెగా’ ఎవరంటే ఠక్కున వినిపించే పేరు అల్లు అర్జున్.. అయితే ఇది అంత ఈజీగా దక్కలేదు..
300 బస్సులు, 1500 మందితో ఫైట్.. ‘పుష్ప’ లో ఆ సాంగ్ కోసం అంత కష్టపడ్డారా..
అల్లు అర్జున్ దీని కోసం ఎంతో కష్టపడ్డాడు. స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఎంతో కేర్ తీసుకునే అల్లు అర్జున్, ఓ క్యారెక్టర్ ఒప్పుకుంటే ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు. ‘ఆర్య’ సినిమాతో యూత్‌కి నచ్చేసిన అల్లు అర్జున్ కెరీర్‌లో ‘దేశముదురు’, ‘బన్నీ’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘జులాయి’, ‘అల వైకుంఠపురంలో’, ‘సరైనోడు’ వంటి ఎన్నో హిట్టు సినిమాలు ఉన్నాయి. ‘పుష్ప 1’ సినిమాతో పాన్ ఇండియాని షేక్ చేసేశాడు అల్లు అర్జున్.
ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా చేయకుండా పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ తెచ్చుకున్న తెలుగు నటుడు కూడా అల్లు అర్జున్. ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్, ‘పుష్ప 2’ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. మెగా ఫ్యామిలీకి కూడా సాధ్యం కాని మేడమ్ ట్యూబ్స్‌లో మైనపు బొమ్మ గౌరవం అల్లు అర్జున్‌కి దక్కింది. బన్నీ మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తోనే ఇండస్ట్రీకి వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతని ఇమేజ్ వేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు, క్రేజ్ వేరు.. దీనికి కారణం అతని హార్ట్ వర్క్!
Pushpa 2 Exclusive Update : రెస్ట్ లేదా పుష్ప..