Hathras Incident : ఉత్తరప్రదేశ్ జిల్లాలో దారుణం జరిగింది. బాబా బోధనలు వినడానికి వెళ్లిన వేలాదిమంది ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో భక్తులుగా వచ్చినవాళ్లు, శవాలుగా మారారు. ఇప్పటికే 116 మంది భక్తులు ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోగా, 200 మందిపై పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.. హథ్రాస్ జిల్లాలో బాగా ప్రాచుర్యం పొందిన భోలే బాబా.. ప్రార్థనాలు చేద్దాం రమ్మని పిలిచాడని, సత్సంగ్ అని పేరుతో కార్యక్రమానికి వెళ్లారు వేలమంది మంది భక్తులు.
భోలే బాబా చెప్పినదంతా శ్రద్ధగా విన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తుల కంటే ముందే వెళ్లిపోవాలని తెగ హడావుడి పడిన సదరు బాబా గారు, తన కారులో హడావుడిగా బయలుదేరారు. ఆయన ముట్టుకుని దీవెనలు తీసుకోవాలని భక్తులంతా ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగి, తొక్కిసలాట జరిగింది..
దీంతో ఊపిరి ఆడక కొందరు, తీవ్రగాయాలతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది ఆడవాళ్లే ఉన్నారు. అలాగే ముగ్గురు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. అయితే ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన భోలే బాబాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..