Harish Shankar Fire on Websites : రవితేజ హీరోగా వచ్చిన ‘ఈగల్’ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, మొదటి 3 రోజుల్లో మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీకి ఓ ప్రముఖ వెబ్‌సైట్ 1.5/5 రేటింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ‘యాత్ర 2’ మూవీకి 3.25 ఇచ్చి, ‘ఈగల్’ మూవీకి 1.5 ఇస్తారా? అంటూ ట్వీట్ చేసిన దర్శకుడు హరీశ్ శంకర్, ‘ఈగల్’ సక్సెస్ పార్టీలో ఓ లెవెల్‌లో ఫైర్ అయ్యాడు.
Eagle Movie Review : రవితేజ ‘ఈగల్’ పైకి ఎగిరిందా? లేదా?
‘ఈగల్ ఫస్టాఫ్ చూసినప్పుడు బాగుందని అనిపించింది, సెకండాఫ్ చూసిన తర్వాత అదిరిపోయిందని అనిపించింది. డైరెక్టర్ అనుకున్న పాయింట్‌ని ఇంత స్టైలిష్‌గా చూపించడం మామూలు విషయం కాదు. ఇదే కథ నాకు ఇచ్చి ఉంటే ఇలా తీసి ఉండే వాడిని కాదు, అంత బాగా తీశాడు కార్తీక్.. ఈ సినిమా గురించి ఓ ట్వీట్ చూసి, నాకు ఆశ్చర్యమేసింది. లవ్ స్టోరీ ఇంకా బాగా తీయొచ్చు అని రాశారు.. టైటిల్ ఏమైనా ప్రేమ పావురాలు పెట్టారా దీనికి! తుపాకీ పట్టుకుని, అంత గడ్డం పెంచుకుని షూట్ చేసుకుంటూ వెళ్లే మనిషి దగ్గర్నుంచి లవ్ స్టోరీ ఆశించామంటే అస్సలు అర్థం కాలేదు.
సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాక, డైరెక్టర్‌గా మారాడు. అతను తీసిందే రెండు సినిమాలు. అంతలా విమర్శించేముందు ఆలోచించాల్సింది. కొందరు మీరు తీసిన గబ్బర్ సింగ్ కంటే షాక్ నచ్చిందని చెబుతూ ఉంటారు. నేను నవ్వుతాను.. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని రూల్ లేదు. అయితే విమర్శించే ముందు ఓసారి ఆలోచించాలి..
Sembi Movie : చట్టాలు మార్చలేని ఛిద్రమైన బతుకు కథ..
తర్వాత తెలిసింది, ఈ వెబ్‌సైట్, RRR మూవీలో రొమాన్స్ లేదని రాసుకొచ్చాడంట. సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జర్నలిస్టులు కూడా. మనమంతా ఓ కుటుంబం. కాబట్టి దాన్ని మరిచిపోకండి. అందరూ నా సినిమా చూడాలని అనుకుంటా.. విమర్శ వేరు, ఎద్దేవా వేరు! నాలుగేళ్లైంది, సినిమా లేటు అవుతోందని, హరీశ్ శంకర్, నిర్మాతతో కలిసి పెగ్ వేశాడని ఓ వెబ్‌సైట్ రాసింది. మళ్లీ నా ఫోటో ఉండదు. షాడో వేస్తాడు. నువ్వేమైనా నాకు పెగ్ కలిపావా?
రాఘవేంద్రరావుగారు 100 సినిమాలు తీశారు. మేం 100 ఏళ్లు అయినా 27 సినిమాలు తీయలేం. కానీ ఈ నిర్మాత 100 సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సేవ్ టైగర్ కాదు, సేవ్ సినిమా… సేవ్ ప్రొడ్యూసర్.. నా సినిమా వస్తుంది, ట్రోల్ చేద్దామని అనుకుంటూ ఉండొచ్చు. మీకు తెలిసిన ఓ మహానుభావుడే ఓ మాట చెప్పాడు.. మీరు ఏమీ పీకలేరు..’ అంటూ ఆవేశంగా మాట్లాడాడు హరీశ్ శంకర్..