Harihara Veeramallu : అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన హరిహర వీరమల్లు టీమ్..

Harihara Veeramallu : అప్పుడెప్పుడో కరోనాకి ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’… 17వ శతాబ్దానికి స్వాతంత్య్ర సమరయోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని తెలియగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా నాలుగేళ్లుగా రిలీజ్‌కి నోచు కోలేదు. ఆ మూవీ తర్వాత పవన్ సైన్ చేసిన సినిమాలు రెండు థియేటర్లలోకి వచ్చాయి, వెళ్లాయి కూడా..

Pawan Kalyan OG : ఆ ఇద్దరు హీరోలతో పోటీ పడుతున్న పవర్ స్టార్..

ఈ మూవీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, ప్రస్తుతం అనుష్క శెట్టితో సినిమా చేయడానికి రెఢీ అవుతున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే డైరెక్టర్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీపై అప్‌డేట్ ఇచ్చింది హరిహర వీరమల్లు చిత్ర యూనిట్..

‘పవర్ స్టార్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ కోసం హరి హర వీర మల్లు సినిమా గురించి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక సినిమా వీఎఫ్‌‌ఎక్స్ వర్క్ కెనడా, ఇరాన్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో జరుగుతోంది. మీ ఊహలకు అందని విధంగా ఈ సినిమా ఉండబోతోంది. త్వరలోనే స్పెషల్ ప్రొమో విడుదల చేస్తాం..’ అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది హరిహర వీర మల్లు చిత్ర యూనిట్.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న ‘ఓజీ’ మూవీ వస్తుండడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి వీరమల్లు వచ్చే అవకాశం ఉంది.

వేగం పెంచిన విజయ్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post