Hanuman Vs Guntur Kaaram : ‘హనుమాన్’ మూవీని జనవరి 12న రిలీజ్ చేయాలని ప్రకటించినప్పటి నుంచి ‘గుంటూర్ కారం’ టీమ్‌తో పోటీ జరుగుతూ వచ్చింది. మొదటి రోజు హైదరాబాద్‌లో ‘హనుమాన్’ మూవీకి ఒకే ఒక్క సింగిల్ స్క్రీన్ థియేటర్ దక్కింది. నైజాంలో అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లలో కూడా ‘హనుమాన్’ బదులుగా ‘గుంటూర్ కారం’ ప్రదర్శించారు.
Trolls on Guntur Kaaram : అప్పుడేమో రొమాంటిక్ డ్యాన్స్.. ఇప్పుడేమో తల్లీ కొడుకులుగా..
అయితే కంటెంట్ ఉంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయాన్ని అడ్డుకోలేరని నిరూపిస్తూ, ‘హనుమాన్’ ఘన విజయం అందుకుంది. 5 రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసిన ‘హనుమాన్’, ‘గుంటూర్ కారం’ కలెక్షన్లను దాటేసింది. ఐదో రోజు నైజాంలో ‘గుంటూర్ కారం’ మూవీకి 400 థియేటర్ల నుంచి రూ.2.1 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.
అదే సమయంలో ‘హనుమాన్’ మూవీ, 190 థియేటర్ల నుంచి రూ.2.45 కోట్ల షేర్ వసూలు చేసింది. 100 శాతం ఆక్యుపెన్సీతో దూసుకుపోతున్న ‘హనుమాన్’ కారణంగానే, ‘గుంటూర్ కారం’ మూవీకి స్టడీ కలెక్షన్లు వస్తున్నాయి కూడా. ‘హనుమాన్’ టికెట్లు దొరకని వాళ్లు, మరో ఆప్షన్ లేక ‘గుంటూర్ కారం’ చూస్తున్నారట.
Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?
యూఎస్‌లో అయితే ఇప్పటికే 4 మిలియన్ల మార్కు దాటేసిన ‘హనుమాన్’ మూవీ, అక్కడ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో ‘గుంటూర్ కారం’తో పాటు మిగిలిన స్టార్ హీరోల సినిమాలన్నింటికీ భారీ నష్టాలు మిగిలాయి.
Awe Movie : హనుమాన్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ‘అ!’ చూశారా? ప్రశాంత్ వర్మ సినిమాటిక్ బ్రిలియెన్స్..