Hanuman Vs Guntur Kaaram : ‘గుంటూర్ కారం’ వంటి భారీ బడ్జెట్ మూవీతో పోటీపడి, రిలీజ్ అయ్యింది ‘హనుమాన్’. మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబో ‘గుంటూర్ కారం’ మూవీ ముందు ‘హనుమాన్’ నిలబడడం కూడా కష్టమేనని అనుకున్నారంతా. అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. రిజల్ట్ బాక్సాఫీస్ దగ్గర ‘హనుమాన్’ జైత్రయాత్ర…
‘హనుమాన్’ మూవీకి మొదటి రోజు పెద్దగా థియేటర్లు దక్కలేదు. అయినా తొలి రోజు నైజాంలో రూ.3.10 కోట్లు వసూలు చేసిన ‘హనుమాన్’, 50 శాతం పెట్టుబడి వెనక్కి తెచ్చేసింది. రెండో రోజు వసూళ్లతో దాదాపు లాభాల్లోకి వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో రోజు ‘హనుమాన్’ క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. రెండో రోజు బుక్ మై షో యాప్‌లో ‘హనుమాన్’ మూవీ గంటకు 18 వేల టికెట్లు బుక్ అవుతుంటే, ‘గుంటూర్ కారం’ మూవీకి కేవలం 6 వేల టికెట్లు మాత్రమే బుక్ అవుతున్నాయి..
Prashanth Varama : హనుమాన్ సక్సెస్ అయితే, అవతార్ రేంజ్‌లో మూవీ తీస్తా… ప్రశాంత్ వర్మ కామెంట్స్…
హైదరాబాద్‌లో ‘గుంటూర్ కారం’ మూవీ ఆక్యుపెన్సీ 40 శాతం ఉంటే, ‘హనుమాన్’ ఆక్సుపెన్సీ 100 శాతంగా ఉంది. నైజాంలో ‘హనుమాన్’ మూవీకి థియేటర్లు పెరగకపోయినా, ఏపీలో రెండో రోజు దాదాపు 100 థియేటర్లు పెరిగాయి. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. ‘హనుమాన్’ దెబ్బకు ‘గుంటూర్ కారం’ మూవీకి ఊహించని దెబ్బే తగిలింది. చూస్తుంటే,‘హనుమాన్’ వల్ల, ‘గుంటూర్ కారం’ మూవీకి భారీ నష్టాలు రావచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు..