హనుమాన్ ట్రైలర్: సంక్రాంతికి వస్తున్నామ్, కొడుతున్నామ్..

Hanuman Trailer : 2024 సంక్రాంతికి ఏకంగా అరడజను తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. పోటీలో మహేష్ బాబు, రవితేజ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఉన్నారు. వారి మధ్యలో తేజ సజ్జ ‘హనుమాన్’రిలీజ్ అవుతోంది. స్టార్ హీరోల మధ్య ఈ కుర్ర హీరో సినిమా వస్తుందంటే సాహసమే అనుకోవాలి.. అయితే కంటెంట్ ఉన్నప్పుడు ఏ కటౌట్‌కీ భయపడాల్సిన అవసరం లేదని ‘హనుమాన్’ ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

ఇది మా సినిమా! మా ప్లేస్… ‘సలార్’కి ఛాలెంజ్ చేస్తున్న కన్నడ హీరో దర్శన్..

సంక్రాంతికి నలుగురు పెద్ద హీరోలతో పోటీ పడి సినిమా రిలీజ్ చేయడానికి కావాల్సిన కంటెంట్, ‘హనుమాన్’ ట్రైలర్‌లో కనిపించింది. ‘అ!’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ, ట్రైలర్‌లో గ్రాండ్ విజువల్స్ ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి.

హీరోతో ఒక్క మాస్ డైలాగ్ కూడా చెప్పించకుండా ట్రైలర్ కట్ చేసిన విధానానికి ఫిదా అవ్వాల్సిందే. ఈ మూవీలో హీరోకి అక్కగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తుంటే, ‘వాన’ ఫేమ్ వియ్ రాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. హీరోయిన్‌ అమృత అయ్యర్‌ని ట్రైలర్‌లో చూపించని ప్రశాంత్ వర్మ, హీరో మూగవాడేమో అనుకునే టైమ్‌లో తేజ సజ్జతో ‘జై శ్రీరామ్’ అనే ఒకే ఒక్క డైలాగ్ చెప్పించాడు.

‘జల్సా’ కోసం మహేష్.. ‘గుంటూరు కారం’ కి తిరిగి ఇచ్చేస్తున్న పవన్ కళ్యాణ్..

విజువల్ వండర్‌గా కనిపిస్తున్న ‘హనుమాన్’, పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి క్యూ కట్టడం పక్కా. స్టార్ హీరోల సినిమాల మధ్య ‘హనుమాన్’ సరైన థియేటర్లు తెచ్చుకుని, కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు హిట్టు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post