హనుమాన్ మూవీ రివ్యూ: ‘గుంటూర్ కారం’ వంటి భారీ స్టార్ సినిమాతో పోటీపడుతూ రిలీజ్ చేస్తుండడంతో ‘హనుమాన్’ మూవీ టీమ్‌పై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఓ చిన్న సినిమాని వాయిదా వేయడానికి అంత ఆలోచిస్తున్నారేంటని వాదనలు వినిపించాయి. అయితే కంటెంట్ మీద నమ్మకం ఉంచిన ‘హనుమాన్’ మూవీ టీమ్, అనుకున్న టైమ్‌కే సినిమాని రిలీజ్ చేసింది. మరి ‘హనుమాన్’ మూవీ ఎలా ఉంది… అనుకున్న టార్గెట్ అందుకుంటుందా..
Guntur Kaaram vs Hanuman Theaters issue : ఇచ్చినవే 4, అందులో 3 లాగేసుకున్నారు!
టైటిల్ కార్డ్స్‌లో హనుమంతుడి కథ చెబుతూ ‘హనుమాన్’ మూవీ మొదలవుతుంది. కాబట్టి టైటిల్ కార్డ్స్ కూడా మిస్ కావద్దు. అండర్ వాటర్ సీక్వెన్స్‌లతో ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, బాలయ్య బాబు మూవీ సీన్స్‌తో చేసిన సీన్స్… సూపర్బ్‌గా వర్కవుట్ అయ్యాయి..
ఓ కోతి పాత్రకు రవితేజ చెప్పిన డబ్బింగ్, హిల్లేరియస్‌గా వర్కవుట్ అయ్యింది. ‘మర్యాద రామన్న’ సినిమాలో సైకిల్‌కి డబ్బింగ్ చేసిన మాస్ రాజా, మరోసారి తన వాయిస్‌తోనే నవ్వులు పూయించాడు. ప్రీ-ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో సినిమా ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది..
ఫస్ట్ హాఫ్ మొదట్లో కాస్త సాగదీసినట్టు అనిపించినా, సెకండాఫ్‌లో కథ పరుగులు పెడుతుంది. క్లైమాక్స్‌లో ఆఖరి 40 నిమిషాలు, వీఎఫ్ఎక్స్ మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ‘హనుమాన్’ భక్తులు ఈ మూవీని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. మిగిలిన వాళ్లు కూడా వీఎఫ్ఎక్స్ వండర్‌కి ఫిదా అయిపోతారు.. కొన్ని సీన్స్‌కి ‘గూస్ బంప్స్’ రావడం గ్యారెంటీ.. క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్‌కి ఓ కనెక్షన్ పెట్టి ముగించారు…
‘అ!’ సినిమాతో తన టాలెంట్‌ని పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ, ఈ మూవీతో టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోవడం గ్యారెంటీ. ప్రతీ చిన్న విషయంపై ఎంతో కేర్ తీసుకుని, చెక్కినట్టుగా ప్రశాంత్ వర్మ కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనబడుతుంది. తేజ సజ్జ, వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్, వెన్నెల కిషోర్ మరోసారి తమ యాక్టింగ్‌తో ఫిదా చేసేశారు.. హీరోయిన్ అమృతా అయ్యర్‌కి పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కలేదు.
Prashanth Varama : హనుమాన్ సక్సెస్ అయితే, అవతార్ రేంజ్లో మూవీ తీస్తా… ప్రశాంత్ వర్మ కామెంట్స్…
ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఓ చిన్న హీరో మీద ఇంత పెట్టుబడి పెట్టి, ఇంత గ్రాండ్‌గా సినిమాని తెరకెక్కించిన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డిని కచ్ఛితంగా మెచ్చుకోవాల్సిందే. సరిగ్గా ప్రమోట్ చేస్తే, ‘హనమాన్’ బాలీవుడ్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరడం గ్యారెంటీ.. పిల్లలకు, పిల్లలతో వెళ్లే సినిమాకి వెళ్లే పెద్దలకు, వీఎఫ్ఎక్స్ వండర్స్ ఇష్టపడే వారికి ‘హనుమాన్’ కచ్ఛితంగా నచ్చుతుంది..