Hanuman Movie : ఈ చిరంజీవి స్టిల్‌తో ఆ చిరంజీవిని డిజైన్ చేశాం..

Hanuman Movie : ఓ చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి, రూ.300 కోట్లు కొల్లగొట్టింది హనుమాన్ మూవీ. హనుమాన్ మూవీ దెబ్బకు మహేష్ ‘గుంటూర్ కారం’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామి రంగ’ సినిమాలు కలెక్షన్లు తెచ్చుకోవడానికి తెగ కష్టపడాల్సి వచ్చింది. ‘హనుమాన్’ మూవీ కారణంగా తెలంగాణ, ఆంధ్రాలో మూతపడిన దాదాపు 300 థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. ఈ మూవీలో అంజనగిరి పర్వతం దగ్గర హనుమంతుడి విగ్రహం, ప్రేక్షకులకు, హనుమాన్ భక్తులకు థ్రిల్లింగ్ అనుభువాన్ని ఇచ్చింది.

Cat Biryani in Chennai: రోడ్ సైడ్ బిర్యానీలో పిల్లి మాంసం..

ఈ స్టిల్‌ని మెగాస్టార్ చిరంజీవి ‘స్టాలిన్’ సినిమా స్టిల్ నుంచి స్ఫూర్తి తీసుకుని, రూపొందించాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ‘స్టాలిన్ మూవీలో చిరంజీవిగారు అలా చేతులు కట్టుకుని ఉండే స్టిల్‌ని స్ఫూర్తిగా తీసుకుని, హనుమాన్ మూవీలో స్టాచ్యూ డిజైన్ చేశాము..’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..

‘హనుమాన్’ మూవీకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ మూవీని అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీలో ఓ స్టార్ నటుడు హనుమంతుడిగా నటిస్తాడని ప్రశాంత్ వర్మ చెప్పాడు. అయితే ఇప్పటిదాకా ఆ స్టార్ హీరో ఎవరు? అనే విషయంలో ఇంకా అనౌన్స్‌మెంట్ రాలేదు. రానా దగ్గుబాటి, హనుమంతుడిగా నటిస్తాడని ప్రేక్షకులు అంచనా వేస్తుంటే, ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి, చిరంజీవి ఆంజనేయస్వామిగా నటిస్తే అదిరిపోతుందని అంటున్నారు..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post