Hanuman Movie : దిల్ రాజు చెప్పినట్టే చేశాడుగా! హనుమాన్ మూవీకి మరింత ఇంత అన్యాయమా..

Hanuman Movie : 2024 సంక్రాంతికి టాలీవుడ్‌లో పోటీ భారీగా ఉంది. మహేష్ బాబుతో పాటు రవితేజ, వెంకటేశ్, నాగార్జున సినిమాలను రిలీజ్ చేస్తుండడంతో ‘హనుమాన్’ మూవీని వాయిదా వేయాలని కోరాడు నిర్మాత ‘దిల్’ రాజు. అయితే 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ‘హనుమాన్’ మూవీని వాయిదా వేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు ఒప్పుకోలేదు.

సలార్ మూవీకి ప్రభాస్ రెమ్యూనరేషన్..

చిన్న సినిమాకి చిన్న న్యాయం, పెద్ద సినిమాకి పెద్ద న్యాయం జరుగుతుందని హెచ్చరించిన దిల్ రాజు, ‘గుంటూరు కారం’ మూవీ కోసం 99 శాతం థియేటర్లన్నీ బ్లాక్ చేసేశాడు. జనవరి 12న హైదరాబాద్‌లోని 99 శాతం థియేటర్లలో ‘గుంటూరు కారం’ మూవీ విడుదల అవుతుంటే, కేవలం ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే ‘హనుమాన్’ విడుదల అవుతోంది.

‘హనుమాన్’ మూవీతో పాటు జనవరి 12న శివకార్తీకేయన్ నటించిన ‘అయాలన్’ తెలుగు డబ్ వర్షన్ కూడా వస్తోంది. ఇదే రోజు హిందీలో విజయ్ సేతుపతి, కత్రీనా చేసి ‘మెర్రి క్రిస్మస్’ కూడా రిలీజ్ ఉంది. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ రిలీజ్ కూడా 12నే. హైదరాబాద్‌లో ఈ సినిమాలకు కూడా థియేటర్లు కేటాయిస్తారు.

మలయాళం మాయ..

దీంతో వాయిదా వేసుకోమని చెబితే విననందుకు ‘హనుమాన్’ మూవీని మొత్తంగా అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసేసి, చంపే ప్రయత్నం జరుగుతోంది.. మరి ఇప్పటికైనా ‘హనుమాన్’ తెలుగు రిలీజ్‌ని ముందుకి కానీ, వెనకకి కానీ జరుపుతుందో చూడాలి.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post