Hanuman Effect : OTT యుగంలో సింగిల్ థియేటర్లకు పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఈ కారణంగానే చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడ్డాయి. మూతబడుతున్నాయి కూడా. RRR, బాహుబలి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడలేకపోయాయి. అయితే చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్’, గత 5 రోజుల్లో మూత బడిన 32 థియేటర్లు, తిరిగి తెరవడానికి కారణమైంది.
Awe Movie : హనుమాన్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ‘అ!’ చూశారా? ప్రశాంత్ వర్మ సినిమాటిక్ బ్రిలియెన్స్..
నైజాంలో చాలా థియేటర్లలో ‘గుంటూర్ కారం’ మూవీ రిలీజ్ అయ్యింది. అలాగే ‘నా సామి రంగ’, ‘సైంధవ్’ డిస్టిబ్యూషన్ రైట్స్‌ని ‘దిల్’ రాజు కొనుగోలు చేయడంతో ‘హనుమాన్’ మూవీకి ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కడం లేదు. దీంతో మూతబడిన పాత థియేటర్లను తిరిగి ప్రారంభించి, ‘హనుమాన్’ మూవీ ప్రదర్శిస్తున్నారు. ఈ థియేటర్లు కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి.
Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?
నైజాంతో పాటు ఆంధ్రాలోనూ ఇలా థియేటర్లు తిరిగి ఓపెన్ అవుతున్నాయి. గత 20 ఏళ్లలో ఓ తెలుగు సినిమా కారణంగా మూతబడిన థియేటర్లు, తిరిగి ఓపెన్ కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు మహేష్ ‘పోకిరి’ టైమ్‌లోనే ఇలా జరిగింది. ఆ తర్వాత ఏ ఇండస్ట్రీ హిట్ మూవీ కూడా ఈ మ్యాజిక్‌ని రీక్రియేట్ చేయలేకపోయింది.
https://www.facebook.com/Raamulamma.Afire?mibextid=ZbWKwL