Hanuman Director Prashanth Varma : 2024 సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మహేష్ గుంటూర్ కారం, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామి రంగ మధ్య తేజ సజ్జ హీరోగా రూపొందిన ‘హనుమాన్’ మూవీ వస్తోంది. పెద్ద హీరోలతో పోటీ ఎందుకని ‘హనుమాన్’ నిర్మాతను దిల్ రాజు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, వాయిదా వేయడానికి వాళ్లు ఒప్పుకోలేదు. అదీకాకుండా మిగిలిన సంక్రాంతి సినిమాలన్నీ తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుంటే, ‘హనుమాన్’ మాత్రం పాన్ వరల్డ్ లెవెల్‌లో 10 భాషల్లో విడుదల అవుతోంది.
2024 Movies Sankranthi Competition : సంక్రాంతికి థియేటర్ల లొల్లి! మరి వెనక్కి తగ్గేది ఎవరు?
‘నేను ముందుగా వచ్చాను. నాది సైకిలే కావచ్చు, నా తర్వాత వచ్చినవి మోటర్ సైకిలే కావచ్చు, కార్లే కావచ్చు. కొన్నిసార్లు నా సైకిల్‌తో గుద్దితే కారుకి సొట్ట పడొచ్చు. హనుమాన్ రిలీజ్ ముందుగానే అనుకున్నాం. అనుకున్న టైమ్‌కి ఎన్ని అవాంతరాలు ఎదురైనా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం..
‘హనుమాన్’ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నకొద్దీ అడ్డంకులు వస్తున్నాయి. రీసెంట్‌గా సెన్సార్ విషయంలో కూడా అడ్డు పడ్డారు. ఎవరు ఇలా చేస్తున్నారనేది నాకైతే తెలీదు, కానీ కావాలని ఆపుతున్నారని అర్థమైంది. ప్రభాస్ అన్న, రవితేజ అన్న ఎంతో సహకరించారు. ప్రభాస్ అన్నను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను.. ’ అంటూ కామెంట్ చేశాడు ప్రశాంత్ వర్మ..
హనుమాన్ ట్రైలర్: సంక్రాంతికి వస్తున్నామ్, కొడుతున్నామ్..
‘అ!’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ, ఆ తర్వాత రాజశేఖర్‌తో ‘కల్కీ’ అనే మూవీ తీశాడు. ఆ తర్వాత తేజ సజ్జతో ‘జాంబిరెడ్డి’ మూవీ చేసి సూపర్ హిట్టు కొట్టాడు. ప్రశాంత్ మూవీ యూనివర్స్‌లో 12 సినిమాలు వరుసగా రాబోతున్నాయి. అందులో మొదటి ‘హనుమాన్’. దీని తర్వాత ‘అధీర’ పేరుతో మరో మూవీ రాబోతోంది.