Hanuma Vihari : తెలుగు రాష్ట్రాల నుంచి టీమిండియాకి ఆడుతున్న ఒకే ఒక్క క్రికెటర్ హైదరాబాదీ మియా మహ్మద్ సిరాజ్. ఆంధ్రా నుంచి శ్రీకర్ భరత్, హనుమ విహారి టెస్టు టీమ్‌లోకి వెళ్లినా స్థిరమైన చోటు దక్కించుకోలేకపోయారు. టెస్టు స్పెష్లిస్ట్ ప్లేయర్ హనుమ విహారి ఆటతీరు అంటే తనకెంతో ఇష్టమని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. 7 సీజన్లుగా ఆంధ్రాకి కెప్టెన్‌గా ఉన్న హనుమ విహారిని, 2024 రంజీ ట్రోఫీ సమయంలో బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్..
టీమ్‌లో కాదు కదా, కనీసం 15 మందిలో కూడా లేని ఓ 17వ ప్లేయర్ కోసం కెప్టెన్‌నే మార్చేసింది. తిరుపతికి చెందిన ఓ రాజకీయ నాయకుడి కొడుకైన పృథ్వీరాజ్ ప్రవర్తనపై హనుమ విహారి సీరియస్ అయ్యాడు. దీంతో పృథ్వీరాజ్, వాళ్ల నాన్నకు చెప్పడం, ఆ రాజకీయ నాయకుడు తన పలుకుబడితో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కి ఫోన్ చేయడం జరిగిపోయాయి. దీంతో హనుమ విహారిని కెప్టెన్సీ నుంచి తప్పించింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్..
దీంతో తీవ్ర మనస్థాపం చెందిన హనుమ విహారి, ఇకపై ఆంధ్రా టీమ్‌కి ఆడబోనంటూ తెలియచేశాడు. ఇదంతా ఎవరి గురించి అని ఎవరికి తెలియకబోయినా స్వయంగా ప్రకటించుకున్నాడు ఆ రాజకీయ నాయకుడి కొడుకు. ‘మీరు వెతికేది నా గురించే… అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. నువ్వు ఇంతకంటే ఇంకేం పీకలేవు మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్’ అంటూ పోస్ట్ చేసి మరీ, తనవల్లే హనుమ విహారి కెప్టెన్సీ పోయిందని ప్రకటించుకున్నాడు పృథ్వీరాజ్.. తిరుపతి కార్పొరేటర్ అయిన కుట్రపాకం నరసింహం కొడుకే ఈ పృథ్వీరాజ్..
MS Dhoni : స్నేహితుడి కోసం ధోనీ చేసిన ఓ చిన్న పని.. అతని కెరీర్‌నే మార్చేసింది..