Handloom Sarees : క్రికెట్ మ్యాచ్ లు అంటే.. ఇండియా గుర్తొస్తుంది కానీ ఇండియా అంటే గుర్తు వచ్చేది మాత్రం హ్యాండ్లూమ్ సారీస్. ఇండియా హ్యాండ్లూమ్ సారీస్ లో మొదటి ప్లేస్ లో ఉంది. మగ్గం యంత్రం ద్వారా వీటిని చేతితో తయారు చేస్తారు. భారత్ లో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలో ఇది ఒక అరుదైన, అద్భుతమైన ఘనత. ఆరు గజాల చీర ఆవలీలాగా ఒద్దికగా కట్టడం భారతీయ మహిళకు మాత్రమే తెలిసిన విద్య. చీరకట్టు భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. గ్రామీణ భారతంలో ఆర్థికాభివృద్ధికి చేనేత చీరల ఉత్పత్తి ముఖ్యమైనది.
పిల్లల్లో మొబైల్ వాడకం పెరగడానికి కారణాలు..
భారతదేశంలోని ప్రతి ప్రాంతం ప్రత్యేకమైన చేనేత చీర సంప్రదాయం, విభిన్న నేత పద్ధతులు, మూలాలు నమూనాలను కలిగి ఉన్నాయి. వారణాసి నుండి బనారసి చీరలు, తమిళనాడు నుండి కంజీవరం చీరలు, మహారాష్ట్ర నుండి పైథాని చీరలు, పశ్చిమ బెంగాల్ నుండి బాలుచారి చీరలు, మధ్యప్రదేశ్ నుండి చందేరి చీరలు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉప్పాడా, మంగళగిరి, పోచంపల్లి, ధర్మవరం, ఇక్కత్, గద్వాల, వెంకటగిరి చీరలు మొదలగునవి ఎంతో ప్రాచుర్యం పొందాయి.
చీరలు స్త్రీల అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. చరిత్రలోకి వెళ్తే.. 1983లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్గ్ తన ప్రత్యేక స్థానాన్ని కనపరిచింది. ఆ టైమ్ లో భారతీయ స్రీలు ధరించిన దుస్తులు ప్రపంచ దేశాల దృష్టిలో పడ్డాయి. వరల్డ్ కప్ లో అనేక దేశాలు పాల్గొనగా.. మ్యాచ్ ను తిలకించడానికి వచ్చిన భారతీయ స్త్రీల చీరలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికీ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుంటే అక్కడకు వచ్చిన స్త్రీల.. ఇండియన్ హ్యాండ్లూమ్ సారీస్ క్రికెట్ లవర్స్ ని, వీక్షకులను ఆకర్షిస్తాయి.
మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన మాధవీలత… ఆ వ్యాఖ్యలు బాలయ్యను ఉద్దేశించేనా..
అయితే ఒకప్పుడు దేశానికే వన్నె తెచ్చినా ఈ హ్యాండ్లూమ్ సారీస్.. ఓ దశాబ్దం క్రితం తమ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొనగా.. నేటితరం చేనేత వస్త్రాల గొప్పదనాన్ని గుర్తించి వాటిని ఆదరించి అక్కున చేర్చుకున్నారు. డిమాండ్ ఉన్నప్పుడే ఏ కళైనా రాణిస్తుంది. చీరలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. Old Is Gold అన్నట్టూ నేటి తరం చీరలను ఆదరించడంతో నేత కళాకారులు కూడా వారి నైపుణ్యం పెంచుకుంటూ ట్రెండ్ కి తగ్గట్టు షర్ట్స్, మాస్కులు మొదలగునవి ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాగే అందరూ ఆదరిస్తేనే హ్యాండ్లూమ్ సారీస్ తన పూర్వ వైభవాన్ని సంతరించుకొంటాయి.