Hair Fall Control : జుట్టు ఉన్నవాళ్ళకి దాని విలువ తెలియదు కానీ అది ఊడిపోతున్నప్పుడే అందులో ఉన్న బాధ అర్థమవుతుంది. ఆ తర్వాత రకరకాల షాంపులు, క్రీములు, ట్రీట్మెంట్స్ అని ఎన్ని డబ్బులు వృథా చేసిన ఫలితం శూన్యం. మనం తీసుకునే ఆహారం వల్ల కానీ లేదా మన జీన్స్ వల్ల కానీ, పొల్యూషన్స్.. కారణాలు ఏవైనా, ఎన్నైనా జుట్టు రాలడం అనేది సర్వసాధారణం అయిపోయింది. జుట్టు రాలడంతో చాలామందిలో మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఇంట్లోనే సహజంగా తయారు చేసుకున్న ప్యాక్ లు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
కావాల్సిన పదార్థాలు :
* మెంతులు
* అలోవేర
* మందార ఆకులు
* 2 స్పూన్ల కొబ్బరి నూనె/ ఆముదం / బాదం నూనె
● రాత్రంతా నానబెట్టిన మెంతులు మీ హెయిర్ లెన్త్ ని బట్టి రెండు లేదా మూడు స్పూన్లు తీసుకోండి. ఈ మెంతుల్లో బిటో కెలిటిన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ E వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుని దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి.
● అలోవేర వలన ఆయుర్వేదపరంగా ఎన్నో ప్రయోజనాలున్న విషయం తెలిసిందే. అలోవేర ఫేస్ ని, స్కిన్ ని, హెయిర్ ని హెల్దీగా ఉంచుతుంది. ఈ అలోవేరలోని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.
● మందార ఆకులు చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని ఆపుతుంది. అలాగే తల్లో ఉండే పేలు, డాండ్రఫ్ తగ్గేలా చేస్తుంది.
తయారు చేసుకునే విధానం :
రాత్రంతా నానబెట్టిన మెంతులు, అలోవేరా గుజ్జు, మందారకులు మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో రెండు స్పూన్ల కొబ్బరినూనె లేదా రెండుస్పూన్ల ఆముదం, లేదా రెండు స్పూన్ల బాదం ఆయిల్ ఏదైనా మీకు అందుబాటులో ఉండేది అందులో వేసి అన్నీ బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ని హెయిర్ కి అప్లై చేసి అరగంట తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది.
మీరు ఫస్ట్ టైం పెట్టుకోగానే దీని రిజల్ట్ మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. దీన్ని ది కింగ్ ఆఫ్ హెయిర్ ప్యాక్ (The king of hair pack) అనొచ్చు. దీన్ని మీరు ఫస్ట్ టైం అప్లై చేయగానే మీ హెయిర్ ఊడిపోవడం ఆగిపోతుంది. సెకండ్ టైం పెట్టేసరికి మీ హెయిర్ పెరగడం మీకు అర్థమవుతుంది. మీరు ప్రతి వారం క్రమం తప్పకుండా దీన్ని పెట్టుకుంటే ఒక నెల రోజుల్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.
చెంచుల కడుపు నింపుతున్న భూచక్రగడ్డ..