Guntur Kaaram vs Hanuman Theaters issue : పట్టుబట్టి మరీ, ‘గుంటూర్ కారం’ మూవీతో పోటీగా అదే రోజు విడుదల అవుతోంది ‘హనుమాన్’ మూవీ. ఈ కారణంగానేమో ‘హనుమాన్’ మూవీకి థియేటర్లే దొరకడం లేదు. రిలీజ్ రోజున ‘హనుమాన్’ మూవీకి హైదరాబాద్‌లో 4 థియేటర్లు కేటాయించారు. అయితే రిలీజ్‌కి ఒక్క రోజు ముందు వాటిల్లో 3 థియేటర్లలో మళ్లీ ‘గుంటూర్ కారం’ వేయబోతున్నారు. దీంతో హైదరాబాద్‌లో కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సప్తగిరి థియేటర్లో మాత్రమే ‘హనుమాన్’ రిలీజ్ అవుతోంది..
నైజాంలోని చాలా థియేటర్లలో కూడా ఇదే జరుగుతోంది. హన్మకొండలో అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లో కూడా గుంటూర్ కారం వేస్తున్నారని నిర్మాత గోడు వెల్లబుచ్చుకున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 4 సినిమాల్లో 3 సినిమాలను దిల్ రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది. ఏషియన్ ఫిల్మ్ ఛెయిన్ అంతా దిల్ రాజు చేతుల్లోనే ఉంది..
ఈ కారణంగా ఏషియన్ మల్టీప్లెక్స్ థియేటర్లలో కూడా ‘హనుమాన్’ మూవీకి షోస్ ఇంకా కన్ఫార్మ్ కాలేదు. చూస్తుంటే జనవరి 11న ప్రీమియర్స్ పడినా, జనవరి 12న ‘హనుమాన్’ మూవీకి నైజాం మొత్తంలో 3-4 థియేటర్లు మాత్రమే దక్కేలా ఉన్నాయి. జనవరి 13న ‘సైంధవ్’, 14న ‘నా సామి రంగ’ సినిమాలు కూడా వస్తుండడంతో పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్లు ఉండవు.
‘చిన్న సినిమాని తొక్కేస్తున్నారు?’ అనే కాన్సెప్ట్‌తో బీభత్సమైన పబ్లిసిటీ తెచ్చుకున్నా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్’ మూవీకి థియేటర్లు అయితే సంపాదించుకోలేకపోయాడు నిర్మాత నిరంజన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.22 కోట్లకు ‘హనుమాన్’ మూవీకి విక్రయించారు. ప్రీమియర్ షోస్ ద్వారా రూ.2 కోట్లు వచ్చేసినా… థియేటర్లు లేకుండా మిగిలిన సొమ్ము రిటర్న్ రావడం అసాధ్యం.. మరి ఈ థియేటర్ల రచ్చ ఎంత వరకూ వెళ్తుందో చూడాలి..