Guntur Kaaram Story : మాటల రచయితగా కెరీర్ మొదలెట్టి, డైరెక్టర్‌గా మారాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే నవలల నుంచి, ఇంగ్లీష్, ఫ్రెంచ్ సినిమాల నుంచి కథలను, సీన్స్ లేపేస్తాడనే ట్రోల్స్ చాలా ఏళ్లుగా ఫేస్ చేస్తున్నాడు త్రివిక్రమ్.. ఇంతకుముందు సినిమా రిలీజ్ అయ్యాక కాపీ ఆరోపణలు వస్తే, ఇప్పుడు సినిమా రిలీజ్‌కి ముందే వస్తున్నాయి. మహేష్‌తో చేసిన ‘గుంటూర్ కారం’, మలయాళంలో సూపర్ హిట్టైన ‘రాజా మాణిక్యం’ అనే సినిమాకి రీమేక్ అంటూ ట్రోల్స్ వస్తున్నాయి.
మలయాళ మెగాస్టార్ మమ్మూట్టీ హీరోగా నటించిన ‘రాజా మాణిక్యం’ మూవీ కూడా మదర్ సెంటిమెంట్ కథే! ఓ ధనవంతుడిని పెళ్లి చేసుకున్న తల్లి, కొడుకుని తన తాత దగ్గర అనాథగా వదిలేస్తుంది. తల్లి ఉన్నా, అనాథగా పెరిగే ఆ కుర్రాడు, ఓ మాఫియా డాగ్‌గా మారతాడు. తల్లికి కష్టం వచ్చిందని తెలుసుకుని, ఆ ఇంటికి వెళ్లి దాన్ని తీరుస్తాడు.. ట్రైలర్‌ని గమనిస్తే ‘గుంటూర్ కారం’ కథ కూడా ఇదే..
Sankranthi Movies 2024 : సంక్రాంతి సినిమాల టార్గెట్ ఎంతంటే..?
కొన్నేళ్లుగా సొంత కథ రాయలేకపోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, మరోసారి పక్కోడి కథకు తన పేరు వేసుకున్నాడా? లేక తన క్రియేటివిటీతో మూల కథలో మార్పులు చేర్పులు చేశాడా? అనేది తెలియాలంటే జనవరి 12న బెనిఫిట్ షో రిజల్ట్ వచ్చేదాకా ఆగాల్సిందే..