Guntur Kaaram : ఆలస్యం అమృతం విషం.. ఈ సామెత గుంటూరు కారం మూవీకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. గురూజీ సూపర్ స్టార్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ అనగానే అందరిలో అంచనాలు రెట్టింపయ్యాయి. అప్పటికే వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్ లో హిట్స్ కాకపోవడంతో ఈసారి గట్టిగా కొడతారు అనుకున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న హీరో, డైరెక్టర్.. సంక్రాంతికి వస్తుంటే.. సందడి మాములుగా ఉండదు అని సంబరపడ్డారు.
గుంటూరు కారం రివ్యూ : ఓన్లీ ఫర్ ఫ్యాన్స్.. మిగిలిన వాళ్లకి ఎక్కడం కష్టమే..
టాలీవుడ్ కే పరిమితమైన సినిమా అయినప్పటికీ థియేటర్స్ అన్నీ కబ్జా చేసేసారు. ఫస్ట్ డే అడ్వాన్స్డ్ బుకింగ్స్ చూసి ఆనందపడ్డ అభిమానులకు షాక్ ఇచ్చింది గుంటూరు కారం టీం. ఇంతకీ గుంటూరు కారం మూవీ ఫ్లాప్ కి కారం ఎవరంటే.. ముఖ్యంగా వినిపిస్తున్న పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.
మొదట గుంటూరు కారం సినిమాను ఏప్రిల్ 2023 లో విడుదల చేయాలని నిర్ణయించుకుంది చిత్ర యూనిట్.. అయితే షూటింగ్ ప్రారంభం ఆలస్యం అవడంతో.. నెక్స్ట్ రిలీజ్ డేట్ ఆగస్టు 2023 కు షిఫ్ట్ అయ్యింది. ఇక అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకునేలోపు ఓ ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేసాడు సూపర్ స్టార్. ఆ తర్వాత వచ్చిన వాడు వచ్చినట్టు ఉండకుండా ఈ సీన్ బాలేదు, ఆ సీన్ వద్దు అంటూ.. మొత్తం స్టోరీ, కాస్టింగ్ అండ్ క్రూ నే మార్చేశాడు డైరెక్టర్ నిర్ణయానికే విలువనిచ్చే మన హీరోగారు.
పూజ హెగ్డే, నటి రోహిణి, ఖుషిత కల్లపు, వంశీ చాగంటి, గోపారాజు రమణ మొదలగు క్యాస్టింగ్ మారగా ఎన్నో సీన్స్ రీషూట్ చేశారు. అంతేకాదు.. గుంటూర్ కారం మూవీకి ముందుగా పీ.ఎస్. వినోద్‌ని సినిమాటోగ్రాఫర్‌గా అనుకున్నారు. అయితే మధ్యలో వినోద్ తప్పుకోవడంతో అతని ప్లేస్‌లో మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వచ్చాడు. అలాగే ఫైట్ మాస్టర్లు కూడా మధ్యలో మారిపోయారు.
ఇవన్నీ చూస్తుంటే.. గురువుగా అనుకున్న కథ వేరు, హీరో గారు తీయించిన కథ వేరు అన్నట్టుగా తయారైంది. ఏదేమైనా ఒకప్పుడు డైరెక్టర్ చెప్పినట్టే చేస్తాడు అన్న పేరున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇకనైనా స్టోరీలో వేలెట్టకపోతే బాగుండు అని సగటు సినిమా ప్రేక్షకుడు భావిస్తున్నాడు.