Guntur Kaaram : ఇంతకుముందు సినిమా రిలీజైన తర్వాత తర్వాతి రోజు న్యూస్ ఛానెల్స్‌లో జనాల అభిప్రాయం అడిగేవాళ్లు. దాదాపు హీరో ఫ్యాన్సే కాబట్టి సూపర్, బంపర్, 100 డేస్ పక్కా అనేవాళ్లు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సినిమా రిలీజైన నిమిషాల్లోనే రివ్యూలు వచ్చేస్తున్నాయి. సినిమా బాగోలేకపోతే హీరోని, డైరెక్టర్‌ని, మ్యూజిక్ డైరెక్టర్‌ని ఓ ఆటాడేసుకుంటున్నారు. సంక్రాంతికి విడుదలైన ‘గుంటూర్ కారం’ సినిమా కూడా ఫస్ట్ షో నుంచి ఇలాంటి ట్రోలింగ్ ఫేస్ చేసింది..
ఈ ట్రోలింగ్‌పై తాజాగా స్పందించాడు నిర్మాత నాగవంశీ.. ‘నేను చాలా మీమ్స్ పేజీల్లో చూశాను. హీరో మాటిమాటికి గుంటూర్ నుంచి హైదరాబాద్ పోతున్నాడు. హైదరాబాద్ నుంచి గుంటూర్ పోతున్నాడని వెటకారంగా మీమ్స్ చేశారు. అంటే ఇప్పుడు హీరో 3 గంటల జర్నీ మొత్తం చూపించాలా… లేక మధ్యలో టీ షాప్ దగ్గర ఎలా టీ తాగడు కూడా చూపించాలి..
SSMB29 : మహేష్ సినిమాలో విలన్‌గా హృతిక్ రోషన్.. కాదంటే..
హీరో, వాళ్ల మదర్ మధ్య ఎమోషన్ చూడాలి. అంతేకానీ గుంటూర్ ఎందుకు వెళ్తున్నాడు? హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడు? ఎందుకు ఇవన్నీ? అతను ఎక్కడుంటే మీకు ఎందుకు? ఏం చేస్తే మీకు ఎందుకు… ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలామంది సినిమా బాగుంది కదండీ.. ఎందుకని అంతలా ట్రోల్స్ వచ్చాయని అడుగుతున్నారు.. వాళ్లకి నేను ఏమని సమాధానం చెప్పగలను..
జనాలకి లాజిక్స్ అవసరం లేదు. ఫ్యాన్స్ కూడా అంతే. వాళ్లు హీరో స్టెప్పులను ఎంజాయ్ చేస్తారు. లాస్ట్‌లో మాస్ ఐటెం సాంగ్ ఉండాలని అనుకుని పాట పెట్టాం. అక్కడికి హీరోయిన్ ఎందుకు వచ్చింది? ఆమె చీర ఎందుకు మార్చుకుంది.. ఇలాంటి లాజిక్స్ అన్నీ ఎవడికి కావాలి? ఎందుకు కావాలి..’ అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ..