Guntur Kaaram : మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘గుంటూర్ కారం’ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చేసింది. నెల కూడా తిరగకుండానే ఓటీటీలో కూడా ప్రత్యేక్షమైంది. బెనిఫిట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న గుంటూర్ కారం మూవీని మహేష్ బాబు వన్ మ్యాన్ షోతో 96 శాతం వెనక్కి రాబట్టగలిగాడు. మరో అజ్ఞాతవాసిలా భారీ నష్టాలు తప్పవని అనుకున్న సినిమా, మహేష్ కారణంగా చాలా సేఫ్ అయ్యింది.
Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?
తాజాగా సినీ మాటల రచయిత పరుచూరి గోపాల కృష్ణ, గుంటూర్ కారం మూవీ చూసి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించాడు. ‘నాకు గుంటూర్ కారం మూవీ చూశాక, ఒక్కటే అనిపించింది ఇది మహేష్ చేయాల్సిన సినిమా కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలకు వెరైటీగా టైటిల్స్ పెడతాడు. అయితే ఈ సినిమాకి మాత్రం టైటిల్ సెట్ కాలేదని అనిపించింది.
గుంటూర్ కారం అని కాకుండా గుంటూరు అబ్బాయి అని పెట్టాల్సింది. ఈ మూవీలో త్రివిక్రమ్ తన పెన్‌కి ఎక్కవ పని చెప్పలేదు. అందుకే తాత, మనవళ్ల మధ్య సెంటిమెంట్ కానీ, తల్లీ కొడుకుల మధ్య సెంటిమెంట్ కానీ పెద్దగా పండలేదు. ఓ సంతకం కోసం ఇంత డ్రామా నడుస్తుందా? ఎమోషన్స్ పండలేదు, సెంటిమెంట్ సరిగా లేదు.
అదీకాకుండా ఏ క్యారెక్టర్ కూడా క్లైమాక్స్‌లోనూ రియలైజ్ కాలేదు. మహేష్ సినిమా చూసినప్పుడు కలిగే సంతృప్తి అయితే ఈ సినిమా ఇవ్వలేకపోయింది. త్రివిక్రమ్ కూడా మళ్లీ ఓ మంచి కథతో సినిమా చేస్తాడని అనుకుంటున్నా..’ అంటూ చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ..
Srimanthudu Controversy : కొరటాలను వెంటాడుతున్న ‘శ్రీమంతుడు’ కాంట్రవర్సీ..