Guntur Kaaram : ‘గుంటూర్ కారం’ మూవీపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్స్ వచ్చిన ఈ కాంబోలో ‘గుంటూర్ కారం’ మైలురాయి చిత్రంగా మారుతుందని చాలా మంది అనుకున్నారు. ఈజీగా బాహుబలి రికార్డులకు దగ్గరి దాకా వెళ్తామని ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగ వంశీ చేసిన కామెంట్లు చూసి, బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు చాలామంది.
Sr NTR Vardhanthi : దేవుడిగా బతికి, ఒంటరిగా విడిచి.. ఎన్టీఆర్ ఆ తప్పు చేయకపోయి ఉంటే..
‘హనుమాన్’ మూవీకి థియేటర్లు ఇవ్వకుండా, ‘గుంటూర్ కారం’ థియేటర్లన్నింటినీ కబ్జా చేసినా మహేష్ – త్రివిక్రమ్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలని అనుకున్నారు చాలామంది. అయితే చిన్న సినిమా అని థియేటర్లలోకి వచ్చిన ‘హనుమాన్’ దెబ్బకు, ‘గుంటూర్ కారం’ బ్యాగులు సర్దేసుకుంది. మహేష్ సినిమాకి మల్టీప్లెక్సుల్లో రూ.400, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.200 టికెట్ రేటు పెట్టారు. అదే ‘హనుమాన్’ మూవీ మల్టీప్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150 ధరతో రిలీజ్ అయ్యింది.
టికెట్ రేట్లు తక్కువ, థియేటర్ల సంఖ్య తక్కువ.. అయినా కలెక్షన్లు మాత్రం ‘గుంటూర్ కారం’ కంటే ఎక్కవ రాబట్టింది ‘హనుమాన్’. దీన్ని తట్టుకోలేకపోయిన మహేష్ అభిమానులు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. వారిని శాంతపరిచేందుకు ‘గుంటూర్ కారం’ మొదటి వారం రూ.212 కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?
ఈ పోస్టర్ కొందరు డై హార్ట్ అభిమానులను సంతృప్తిపరిచిందేమో కానీ, బుక్ మై షో ఓపెన్ చేస్తే ఎన్ని టికెట్లు బుక్ అవుతున్నాయో క్లియర్‌గా అర్థమవుతుంది. ఖాళీ థియేటర్లు చూస్తూ, ఫ్యాన్స్ కోసం రికార్డు కలెక్షన్ల పోస్టర్లు రిలీజ్ చేయడం వరకూ ఓకే, కానీ గురూజీని నమ్మి, కోట్లు పెట్టి సినిమాని కొన్న డిస్టిబ్యూటర్ల సంగతి ఏంటి? ఎంత లేదన్నా ‘గుంటూర్ కారం’ మూవీకి రూ.40-60 కోట్ల వరకూ నష్టాలు వచ్చాయని అంచనా… మరి వారి సంగతేంటి? గురూజీయే చెప్పాలి..