Guntur Kaaram : ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో ‘తోక ఎత్తిన కాకి’, ‘తోక దించిన కాకి’, ‘పిండం తింటున్న కాకి’ అని ఓ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు చేస్తున్న‘ మూడో సినిమా ‘గుంటూరు కారం’ విషయంలో ఈ డైలాగ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందేమో.
ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవలో తలదూరుస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..
ఎందుకంటే ఇప్పటికే ‘గుంటూరు కారం’ మూవీ నుంచి అరడజను వరకూ మూవీ స్టిల్స్ విడుదల అయ్యాయి. అందులో ప్రతీ దాంట్లో బాబు-బీడీ రెండూ కామన్. బీడీ తాగుతున్న స్టిల్‌ని ఓసారి సైడ్ నుంచి, ఇంకోసారి ముందు నుంచి, మరోసారి కారు వెనకాల కూర్చొని తాగుతున్నట్టు.. మళ్లీసార నడుచుకుంటూ బీడీ తాగుతూ వస్తున్నట్టు స్టిల్స్ రిలీజ్ చేసింది ‘గుంటూరు కారం’ చిత్ర బృందం.
ఊరమాస్ బొమ్మ తీస్తున్నాం అని చెప్పడానికి ఒక్కసారి లేదా రెండుసార్లు బీడీ తాగుతున్న స్టిల్ అయితే ఓకే. కానీ ఇలా రిలీజ్ చేసిన ప్రతీ స్టిల్లోనూ ఈ బీడీ పెట్టడం ఏంటో ఫ్యాన్స్‌కి అర్థం కావట్లేదు. చూస్తుంటే ‘భరత్ అనే నేను’ నుంచి ప్రతీ మూవీలో మెసేజ్ ఇస్తున్న మహేష్, ఈ మూవీ చివర్లో ఇంగ్లీషోడి సిగరెట్ తాగకండి, మన బీడీలు తాగండి అని మెసేజ్ ఇవ్వడు కదా! అంటూ ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతను’ 200 రోజులు ఆడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఖలేజా’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా, టీవీల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈసారి ఈ ఇద్దరి కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఫేక్ వీడియోలు చేయడం కూడా నేరమే! రష్మిక వీడియోపై మొదలైన రచ్చ..