Gorre Puranam Review : సుహాస్ హీరోగా నటించిన సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకం బాగా పెరిగింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు, ప్రసన్న వదనం, శ్రీరంగనీతులు సినిమాల తర్వాత సుహాస్ హీరోగా వచ్చిన సినిమా ‘గొర్రె పురాణం’. ట్రైలర్ నుంచే మంచి క్రేజ్ తెచ్చుకున్న ‘గొర్రె పురాణం’ మూవీ సెప్టెంబర్ 20న విడుదల కావాల్సింది. అయితే సెన్సార్ కొన్ని అభ్యంతరాలు చెప్పడంతో కాస్త ఆలస్యంగా సెప్టెంబర్ 21న థియేటర్లలోకి వచ్చింది. మరి సుహాస్ బ్రాండ్‌ని ఈ గొర్రె కాపాడిందా?
టైటిల్‌లో ఉన్నట్టుగానే ఈ సినిమా కథ మొత్తం ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. ఓ గొర్రె పిల్ల, ముస్లింలు బలి ఇస్తున్న ప్రాంతం నుంచి పారిపోతుంది. అటు నుంచి హిందువుల దగ్గరికి వెళ్తుంది. గుడిలో కల్లు తాగడంతో హిందువులు దానికి రాము అని పేరు పెడతారు. గొర్రె వల్ల హిందూ, ముస్లింల మధ్య గొడవలు మొదలవుతాయి. మధ్య గొర్రెకి ఏసు అని పెట్టడంతో కథ క్రైస్తవుల వద్దకు కథ చేరుతుంది. జైలు నుంచి తప్పించుకోవాలని చూస్తున్న హీరో, ఆ గొర్రెని అడ్డం పెట్టుకుని ఏం చేశాడు? ఇదే ‘గొర్రె పురాణం’ మూవీ కథ..
Tollywood : తెలుగు సినిమాకు ‘టాలీవుడ్’ అనే పేరు ఎలా వచ్చింది..!?
ఎప్పటిలాగే సుహాస్ మరోసారి విభిన్నమైన కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చాడు. అయితే ‘జనక అయితే కనక’ సినిమా ప్రమోషన్స్‌ని నెల ముందే మొదలెట్టిన సుహాస్, ఈ ‘గొర్రె పురాణం’ మూవీని అస్సలు ప్రమోట్ చేయలేదు… ట్రైలర్‌లో వివాదాస్పదమైన దేవుడి పేర్లు, సినిమాలో వినిపించవు.. అక్కడ సెన్సార్ కత్తెర వేసింది. ట్రైలర్ చూసిన వాళ్లకి అక్కడ ఏ పేరు వస్తుందో అర్థమైపోతుంది..
ఎంచుకున్న కథకి తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించగలిగాడు డైరెక్టర్ బాబీ. వివాదాస్పదమే అయినా ఫస్టాఫ్ పరుగులు పెడుతుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ లాగినట్టు అనిపిస్తాయి. కాంట్రవర్సీ సబ్జెక్ట్ తీసుకుని, కామెడీ పండించాలనే డైరెక్టర్ ప్రయత్నం బాగుంది. అయితే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్దగా వర్కవుట్ కాలేదు. కొన్ని సీన్లలో కామెడీ వర్కవుట్ కాగా, దీనికి కూడా సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ కార్డ్స్‌లో చూపించడం కాస్త అతిగా అనిపిస్తుంది..
మొత్తంగా ట్రైలర్ చూసి, మరీ ఎక్కువ ఊహించుకోకుండా సింపుల్ కామెడీ ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ ‘గొర్రె పురాణం’ టైమ్ పాస్ సినిమా..