Gold medal in PG while serving prison sentence : అన్నీ ఉండి, బుద్ధిగా కాలేజీకి వెళ్లి చదువుకొమ్మంటే.. సినిమాలు, ప్రేమ, ఎంజాయ్‌మెంట్ అంటూ తిరుగుతుంటారు చాలామంది. అలాంటిది జీవిత ఖైదు పడిన ఓ ఖైదీ, జైలు నుంచే పీజీ పూర్తి చేశాడు. ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.
రేషన్ కార్డు లేకుంటే రైతు బంధు రాదు! ఎన్ని ఎకరాలున్నా ఇస్తామంటూనే..
నంద్యాల జిల్లాలోని సంజామల మండలం పేరుసోముల అనే గ్రామానికి చెందిన దూదేకుల మహమ్మద్ రఫీ 2014లో బీటెక్ చదువుతున్న సమయంలో తన గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ సమయంలో ఏదో విషయమై ఆమెను హత్య చేశాడు. ఈ కేసులో రఫీ, తన ప్రియురాలిని చంపినట్టు నిర్ధారణ కావడంతో 2019లో న్యాయస్థానం, అతనికి జీవిత ఖైదు విధించింది.
కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహమ్మద్ రఫీ, జైలు అధికారుల ప్రోత్సాహంతో చదువు కొనసాగించాడు. ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడని భావించి ఆ యువకుడిపై పోలీస్‌స్టేషన్‌లో హత్యకేసు నమోదైంది. కోర్టులో విచారణ అనంతరం 2019 జూలై నెలలో రఫీకి జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
‘సలార్’లో ఈ తప్పుని గమనించారా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోయావ్ నీల్ మామ..
జైలులో బీటెక్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన రఫీ, 2020లో బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా ఓపెన్ పీజీ పూర్తి చేశాడు. M.A. సోషియాలజీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ర్యాంకు సాధించి, గోల్డ్ మెడల్ పొందాడు. జైలు అధికారుల అనుమతితో యూనివర్సిటీ అధికారులు, రఫీకి గోల్డ్ మెడల్ బహుకరించారు. ప్రేమ కోసం యువతిని హత్య చేసి జీవితాన్ని పాడు చేసుకున్న రఫీ, తాను జైలులో చదువుకుని సాధించిన గోల్డ్ మెడల్‌ని తల్లిదండ్రులకు అంకితం ఇవ్వడం విశేషం.