Geethanjali Malli Vachhindhi Review : అంజలి నటించిన 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ఏడేళ్ల క్రితం వచ్చిన ‘గీతాంజలి’ మూవీకి ఇది సీక్వెల్. ఫస్ట్ పార్ట్‌లో నటించిన శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్ వంటి ప్రధాన తారాగణం అంతా ఇందులోనూ నటించింది. డైరెక్టర్ కావాలనుకునే శ్రీనివాస్ రెడ్డి, సంగీత్ మహల్ అనే బూతు బంగ్లాలో సినిమా తీయాల్సి వస్తుంది. అక్కడ అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఆ సంగీత్ మహల్ కథ ఏంటి? ఇదే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ కథ.
మొదటి పార్ట్‌లో హార్రర్ పెద్దగా వర్కవుట్ కాకపోయినా కామెడీ బాగా వర్కవుట్ కావడంతో మంచి హిట్టు కొట్టింది. అయితే సెకండ్ పార్ట్ విషయానికి వచ్చేసరికి అటు హార్రర్, ఇటు కామెడీ రెండూ వర్కవుట్ కాలేదు. ఎందుకంటే చంద్రముఖి దగ్గర్నుంచి ఇలాంటి కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. దీంతో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీలో సీన్స్ ఇంతకుముందే చూసినట్టు అనిపిస్తాయి.
Tier 2 Heros : సిద్ధూ, విశ్వక్ సేన్ పైకి.. విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని కిందకి..
అంజలి మరోసారి తన నటనతో ఇంప్రెస్ చేసింది. అయితే అంజలి నటనను పూర్తిగా వాడుకునేందుకు అవసరమైన కథ, కథనం ఇందులో లేవు. ఇక శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, సునీల్, ఆలీ ఇలా చాలామంది కమెడియన్లు ఇందులో ఉన్నారు. అయితే వీరిలో ఎవ్వరికీ కడుపుబ్బా నవ్వించే సీన్స్ పడలేదు. అంతలో కొంత సత్య కామెడీ వర్కవుట్ అయ్యింది.
శివ తుర్లపాటి డైరెక్షన్‌లో వచ్చిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ఆరంభంలో కాస్త ఆసక్తి క్రియేట్ చేసినా, దాన్ని కొనసాగించడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. హార్రర్ కామెడీ చేయాలనే తాపత్రయంలో అటు హార్రర్, ఇటు కామెడీ ఏ జోనర్‌కి కూడా న్యాయం చేయలేకపోయారు. ప్రవీణ్ లక్కరాజు అందించిన పాటలు పెద్దగా మెప్పించలేదు. బ్యాక్ గ్రౌండ్ పర్లేదు. సినిమాటోగ్రఫీ బాగున్నా, దానికి తగ్గట్టుగా సీన్స్ లేవు. ఎడిటింగ్‌కి ఇంకా పని చెప్పాల్సింది.
Actor Anjali : హీరోయిన్‌గా 50 సినిమాలు! తెలుగు హీరోయిన్ అంజలి రేర్ రికార్డు..