Gangs of Godavari Review : ‘ గామి’ మూవీతో సూపర్ హిట్టు కొట్టిన విశ్వక్ సేన్, అప్పుడెప్పుడో గత ఏడాది డిసెంబర్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నాడు. తగ్గుతూ ఉంటే తొక్కుతూనే ఉంటారంటూ ఆ సమయంలో ఈ సినిమా వాయిదా గురించి విశ్వక్ సేన్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. ఎట్టకేలకు వాయిదాల మీద వాయిదాలు పడుతూ మే 31న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి విశ్వక్ సేన్‌కి ఈ సినిమా అనుకున్న సక్సెస్‌ని ఇచ్చిందా..
గోదావరి లంక గ్రామాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. విశ్వక్ సేన్ ఇచ్చే వాయిస్ ఓవర్‌తోనే సినిమా ప్రారంభం అవుతుంది. గోదావరి గ్రామాల్లోనూ నాటు పాత్రలను అంతే నాటుగా పరిచయం చేసిన డైరెక్టర్, కథనం విషయంలో పట్టు చూపించలేకపోయాడు. ఈ సినిమాకి ప్రధాన బలం ఫైట్ సీక్వెన్స్‌లు, విశ్వక్ సేన్ క్యారెక్టరైజేషన్.. ఫస్టాఫ్ అంతా స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను సినిమాలో లీనం అయ్యేలా చేస్తుంది. అయితే సెకండాఫ్‌లో కథ కొత్త మలుపులు తిరుగుతుంది..
Ilaiyaraaja : పక్కా కమర్షియల్.. మ్యూజిక్ మాస్ట్రో చేస్తుంది కరెక్టేనా..
ఫస్టాఫ్‌లో కామెడీ, యాక్షన్‌తో సాగిన సినిమా, సెకండాఫ్‌లో దారి తప్పింది. ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్డడం మొదలవుతుంది. మొత్తానికి ట్రైలర్ చూసి, సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న వాళ్లు, అదే అంచనాలతో వెళితే నిరాశ తప్పదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు.
గోదావరి యాసలో సాగే డైలాగులు, తెలంగాణలో జనాలకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. అంజలి క్యారెక్టర్ బాగున్నా, క్లారిటీ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. నేహా శెట్టి మరోసారి తన గ్లామర్‌తో మెస్మరైజ్ చేసింది. సెకండాఫ్‌లో కాస్త ల్యాగ్‌ని పక్కనబెడితే డైరెక్టర్ కృష్ణ చైతన్య బాగానే సక్సెస్ అయ్యారు. నవీన్ నూలి ఎడిటర్‌గా తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. అనిత్ మదాడి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓవరాల్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్న విశ్వక్సేన్కి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరో సక్సెస్ ఇచ్చినట్టే..