Gam Gam Ganesha Movie Review : ‘బేబీ’ వంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ‘గం గం గణేశా’. ఉదయ్ బొమ్మిశెట్టి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలతో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్లుగా నటించారు. మరి ‘ బేబీ’ సక్సెస్ తర్వాత ఆనంద్ దేవరకొండకి వరుసగా రెండో హిట్టు దొరికినట్టేనా..
విజయ్ దేవరకొండతో పోలిస్తే ఆనంద్ దేవరకొండ మొదటి నుంచి కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ప్రతీ సినిమాకి ఎంతో కొంత వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే ‘గం గం గణేశా’ మూవీ కూడా ఓ థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది. హీరో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఓ విగ్రహాన్ని మాయం చేసే బ్యాచ్ ఎంట్రీ ఇస్తుంది. వారి వల్ల అతను ఫేస్ చేసిన సమస్యలు ఏంటి? ఆ సమస్యల నుంచి హీరో ఎలా బయటపడ్డాడు. ఇదే ‘గం గం గణేశా’ మూవీ స్టోరీ..
Vijay Deverakonda – Sai Pallavi : విజయ్ తో సాయి పల్లవి! అప్పుడు మిస్ అయ్యింది కానీ..
స్లోగా స్టార్ట్ అయ్యే మూవీ, ప్రీ ఇంటర్వెల్ సమయానికి కాస్త గాడిలో పడుతుంది. ఆరంభంలో మొదటి 20 నిమిషాలు చాలా స్లోగా సాగినా ఆ తర్వాత కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ఈ సినిమాకి ప్రధాన బలం. క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్లకు తగ్గట్టుగా క్యారెక్టరైజేషన్ రాసుకోవడంతో పాటు స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కట్టి పడేశాడు డైరెక్టర్. ట్విస్టులు కూడా బాగుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది.. అయితే విలన్ క్యారెక్టర్ బలంగా లేకపోవడంతో ‘స్వామి రారా’ వంటి కొన్ని పాత సినిమా ఛాయలు కనిపించడం ఈ సినిమాకి ప్రధానమైన మైనస్..
హీరో ఆనంద్ దేవరకొండ తొలిసారిగా ఎనర్జీ ఉన్న కామెడీ రోల్ చేశాడు. అయితే చిన్న దేవరకొండ ఇంకా కాస్త పరిణతి సాధించాలి. జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్ తన పాత్రలో చక్కగా నటించాడు. చేతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్‌తో పాటు ఆదిత్య జవ్వాడి కెమెరా వర్క్ బాగుంది. ఓవరాల్‌గా ఈ వారం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘గం గం గణేశా’ మంచి టైమ్ పాస్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్స్ కోరుకునేవారికి బాగా నచ్చుతుంది. టీజర్, ట్రైలర్ చూశాక కూడా ‘బేబీ’ లాంటి యూత్‌ఫుల్ సబ్జెక్ట్ కోరుకుని వెళ్తే మాత్రం నిరాశతప్పదు.