Flops continue for Nitin : వరుసగా 12 సినిమాలు, వచ్చినవి వచ్చినట్టే ఫ్లాప్ అవుతూనే ఉన్నా.. పట్టువదలని విక్రమార్కుడిలా సినిమా తర్వాత సినిమా చేస్తూనే పోయాడు నితిన్.. ఉదయ్ కిరణ్ వంటి హీరోలు, రెండు మూడు ఫ్లాపులు పడగానే సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి తెగ కష్టపడితే, బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ ప్రొడక్షన్ హౌస్‌ని పెట్టుకున్న నితిన్.. ఫ్లో ఆగకుండా సినిమాలు చేస్తూ పోయాడు.
నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ: ‘ఎక్స్‌ట్రా’ లేదు కానీ ‘ఆర్డినరీ’గానే ఉంది..
2004లో ‘సై’ తర్వాత 2012లో ‘ఇష్క్’తో కమ్‌బ్యాక్ ఇచ్చిన నితిన్, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ అటాక్’, ‘అ ఆ’ సినిమాలతో వరుసగా మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. ఆ తర్వాత సక్సెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ‘లై’, ‘ఛల్ మోహన రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ ఇలా వరుసగా మళ్లీ హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. ‘భీష్మ’తో మంచి హిట్టు కొట్టినా… ‘చెక్’, ‘రంగ్ దే’, ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పుడు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రూపంలో ఇంకో 4 సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి.
సినిమాల కోసం MBBS Examsకి డుమ్మా కొట్టిన శ్రీలీల.. సాయి పల్లవిని చూసి నేర్చుకోవాలంటూ..
‘మాచర్ల నియోజికవర్గం’ అయినా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ‘ఎక్స్‌ట్రా’ అయితే తొలి షో నుంచే డిజాస్టర్ టాక్‌తో ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. చూస్తుంటే నితిన్, హీరోయిన్ల సెలక్షన్ మీద పెట్టిన శ్రద్ధలో సగం అయినా సరైన సబ్జెక్ట్‌ని ఎంచుకోవడంలో పెట్టి ఉంటే.. పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని అంటున్నారు ఫ్యాన్స్.. ఇకనైనా రూటు మార్చి, కథ, కథనంలో కొత్తదనం ట్రై చేస్తే ఫ్యూచర్ ఉంటుందని సలహాలు ఇస్తున్నారు.