Finger Millet : మన పూర్వీకులు ఎక్కువగా రాగులను వాడేవారు. రాగులు దక్షిణ భారతదేశంలో అనేక గ్రామాలలో ఒక ప్రధానమైన ఆహారం. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు రాగి పిండితో తయారు చేసిన పదార్ధాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులు ఆరోగ్యానికి కొండంత అండగా ఉంటామని మన పూర్వీకుల అనుభవం ద్వారా తెలుస్తుంది.
అందుకే కొందరు ఇప్పటికీ రాగి జావను త్రాగుతుంటారు. ఇంకో గమ్మతైన విషయం ఏంటంతే కోడి పందాలు వేసే పందెం కోళ్ళకు సైతం ఇవే ఎక్కువ పెడతారు. ఎందుకంతే వీటి వల్ల వచ్చే బలం చాలా ఎక్కువ. రాయలసీమలో ఈనాటికీ రాగి సంగటి ఆహరంగా వాడటం జరుగుతోంది కానీ రాగులు చేసే ఉపయోగాలు ఇచ్చే ఆరోగ్యం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ వాడతారు అవేంటో ఇప్పుడు చూద్దాం..
* రాగుల్లో కాల్షియం అధికంగా ఉండడం వల్ల పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడతాయి. జుట్టు ఒత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు రాగుల గంజి పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన మాధవీలత… ఆ వ్యాఖ్యలు బాలయ్యను ఉద్దేశించేనా..
* కడుపులో మంటను తగ్గించి చలువ చేస్తుంది, పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దాహాన్ని తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి చేకూరుతుంది. రాగుల్లో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడి చేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.
* ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి రాగులు మన ఆరోగ్యానికి రక్ష.. ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఆహారంలో వీటిని భాగం చేసేయండి.
స్వాతి చెప్పినట్టుగా ‘month of madhu’ మూవీలో నిజంగా అంతుందా?