Fenugreek Leaves : మంచి ఆరోగ్యం కోసం వేలకువేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఆకు కూరలు.. ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండడమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తాయి. ఆకుకూర ఏదైనా ఆరోగ్యానికి చాలా మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. అందులో మెంతాకు మెంతికూర ఎందుకు తినాలంటే..
పాలిచ్చే తల్లులు తీసుకువాల్సిన ఆహారం..
పోషకాలమయమైన మెంతికూర మహిళలకెంతో మేలు చేస్తుంది. కొందరికి నెలసరికి ముందూ, తర్వాత కడుపునొప్పి, ఇతరత్రా అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు వారంలో మూడునాలుగు సార్లు మెంతికూర తీసుకుంటే ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. మెంతి ఆకుల్లో ఇనుము అధికంగా ఉంటుంది. గర్భిణులు ఎంత తీసుకుంటే అంత మంచిది. శిశువు ఎదుగుదలలో ఇందులోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.
చెంచుల కడుపు నింపుతున్న భూచక్రగడ్డ..
బాలింతలు మెంతికూర తినడం వల్ల పాల వృద్ధి బాగుంటుంది. మెనోపాజ్ సమయంలోనూ మెంతికూర తినొచ్చు. ఆ సమయంలో వచ్చే మార్పులూ, హార్మోన్ల అసమతుల్యతను మెంతిలోని పోషకాలు క్రమబద్ధీకరిస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. నీరసం వంటి వాటిని పోగొట్టి తక్షణ శక్తినందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మెంతికూరను విటమిన్ C సమృద్ధిగా లభించే టొమాటోలతో కలిపి వండితే శరీరం వాటి నుంచి అందే పోషకాలను చాలా త్వరగా గ్రహిస్తుంది.