Fahadh Faasil : అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ తెచ్చిన సినిమా ‘పుష్ప’. ఇంతకుముందు ‘సరైనోడు’, ‘రేసుగుర్రం’, ‘DJ దువ్వాడ జగన్నాథం’ వంటి సినిమాల హిందీ డబ్బింగ్ సినిమాల వల్ల యూట్యూబ్‌కి బన్నీకి మంచి గుర్తింపు వచ్చింది. ‘పుష్ప’ సినిమాతో ఆ గుర్తింపు కాస్తా, క్రేజ్‌గా మారింది. ఎలాంటి ప్రమోషన్ లేకుండా ‘పుష్ప 1’ హిందీ డబ్ వర్షన్ భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
‘పుష్ప 2’ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ని రూ.150 కోట్లకు విక్రయించింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో గుండుతో కనిపించిన పోలీసాఫీసర్ SP భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో విలన్‌గా మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకుముందే మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన ఫహద్ ఫాసిల్, ‘పుష్ప’ మూవీ వల్ల తనకి ఒరిగిందేమీ లేదంటున్నాడు.
Pushpa 2 : పుష్ప కూడా కాపీయేనా! ఆ డైరెక్టర్ షాకింగ్ కామెంట్..
‘సుకుమార్ సర్ కాల్ చేశారని చెప్పగానే, మా ఆవిడ నజ్రియా మరో ఆలోచన లేకుండా సినిమాకి ఓకే చెప్పమని చెప్పింది. నేను కూడా అదే చేశాను. అయితే నిజం చెప్పాలంటే పుష్ప మూవీ వల్ల స్పెషల్‌గా నాకు ఎలాంటి లాభం కలగలేదు. నేను ఈ విషయం సుకుమార్ సర్‌కి కూడా చెప్పాను. దీంట్లో దాచాల్సింది కూడా ఏమీ లేదు. నేను అన్నింట్లో నిజాయితీగా ఉంటాను..’ అన్నాడు ఫహద్ ఫాసిల్.